Begin typing your search above and press return to search.

కోడలిని తెగ ప్రమోట్‌ చేస్తున్న వర్మ

By:  Tupaki Desk   |   16 July 2019 8:34 PM IST
కోడలిని తెగ ప్రమోట్‌ చేస్తున్న వర్మ
X
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కుటుంబ బంధాలకు పెద్దగా విలువ ఇవ్వడని అంతా అనుకుంటూ ఉంటారు. ఎప్పుడో భార్య నుండి విడిపోయిన వర్మ తన కూతురుతో కూడా చాలా లైట్‌ గానే ఉంటాడని అంతా అనుకుంటూ ఉంటారు. అయితే తాజాగా వర్మ తన మేనకోడలు అయిన శ్రావ్య వర్మను సినిమాల్లో తెగ ప్రమోట్‌ చేస్తున్నాడు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా కెరీర్‌ ను ప్రారంభించిన శ్రావ్య వర్మ తాజాగా నిర్మాతగా కూడా మారింది.

కీర్తి సురేష్‌ హీరోయిన్‌ గా ఒక లేడీ ఓరియంటెడ్‌ చిత్రాన్ని శ్రావ్య వర్మ మరో నిర్మాతతో కలిసి నిర్మించింది. నగేశ్‌ కుకునూర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. తమ సినిమాను దిల్‌ రాజు సమర్పిస్తున్నట్లుగా శ్రావ్య వర్మ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్బంగా ఆమె చాలా ఎగ్జైటింగ్‌ గా ఉన్నాను అంటూ పేర్కొంది. దిల్‌ రాజు ఈ సినిమా నచ్చి సమర్పించేందుకు ముందుకు రావడంతో శ్రావ్య సంతోషాన్ని వ్యక్తం చేసింది.

శ్రావ్య ట్వీట్‌ కు స్పందిస్తూ వర్మ... ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్‌ అవుతావంటూ శ్రావ్య వర్మకు వర్మ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇది మంచి సినిమా అవ్వడం ఖాయం అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా ఎన్నో సినిమాలకు పని చేసిన శ్రావ్య వర్మ నిర్మాతగా మారుతున్న నేపథ్యంలో మేనమామ అయిన రామ్‌ గోపాల్‌ వర్మ తెగ ప్రమోట్‌ చేస్తున్నాడు. రామ్‌ గోపాల్‌ వర్మ కుటుంబ విలువలు పెద్దగా పట్టించుకోని వర్మ కోడలిని ప్రమోట్‌ చేస్తుండటం కొందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.