Begin typing your search above and press return to search.
ట్రైలర్ తోనే సగం హిట్ కొట్టేశాడా?
By: Tupaki Desk | 19 Oct 2015 8:15 PM ISTకిల్లింగ్ వీరప్పన్ ట్రైలర్ రిలీజ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. సరిగ్గా వీరప్పన్ నుంచి హతమార్చిన నిమిషంలోనే కిల్లింగ్ వీరప్పన్ ట్రైలర్ లాంఛ్ చేసి, అందరినీ ఆకర్షించిన వర్మ.. అందులోని విజువల్స్ తో మరింతగా ఆకట్టుకున్నాడు. గంధపు చెక్కల దొంగ వీరప్పన్ ని హతమార్చేందుకు పోలీసులు ఎంతగా శ్రమపడాల్సి వచ్చిందన్నదే ఈ మూవీ థీమ్.
చెప్పడానికి హీరోయిజం యాంగిల్ లో చెబ్తాడు కానీ.. వాస్తవానికి వర్మ చూపించేది విలనిజాన్నే. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేసిన వీరప్పన్ ను చంపే కథకు.. ఆయన కొడుకు పునీత్ రాజ్ కుమార్ ని హీరోగా పెట్టుకోవడంలోనే.. వర్మ సగం హిట్ కొట్టాడని చెప్పచ్చు. ట్రైలర్ లోనూ విలనే మెయిన్ బేస్ గా తీర్చిదిద్దాడు.
వీరప్పన్ గురించిన కొన్ని వివరాలను అంకెలతో చెబ్తూ.. చివరకు లాడెన్ ను చంపడానికి 10 ఏళ్ల పడితే.. వీరప్పన్ ను చంపడానికి 20ఏళ్లు అవసరమైంది అంటాడు వర్మ. అలాగే ట్రైలర్ చివరి విజువల్ గా ఖాళీ రోడ్ ను చూపిస్తూ.. ఏదో వెహికల్ వస్తోందని ఎదురుచూస్తున్న సమయంలో.. కమింగ్ సూన్ అంటూ కార్డ్ వేస్తాడు వర్మ. చూడగానే సూపర్బ్ అనిపిస్తుంది ఈ ట్రైలర్.
పనిలో పనిగా కిల్లింగ్ వీరప్పన్ ప్రచారానికి చిరు - పవన్ - చరణ్ లను కూడా వాడేసుకున్నాడు వర్మ. ముగ్గురు కలిసి దిగిన ఫోటోని చూస్తుంటే.. నయాగరా ఫాల్స్ తర్వాత అంత అద్భుతమైన దృశ్యంగా తోచిందన్నాడు రాంగోపాల్ వర్మ. బ్రూస్ లీలో చరణ్ అద్భుతంగా చేశాడని, మరోసారి ఆ మూవీని ఖచ్చితంగా చేస్తానంటూ ట్వీట్ చేశాడు.
