Begin typing your search above and press return to search.

వ‌ర్మ... ఆ ట్రైల‌ర్‌లో ఏముంది?

By:  Tupaki Desk   |   13 July 2015 4:59 AM IST



వాస్త‌వ సంఘ‌ట‌న‌ల‌తో సినిమాలు తీయ‌డాన్ని ఇష్ట‌ప‌డుతుంటాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ముఖ్యంగా కరెంట్ ఎఫైర్స్‌పై ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తూంటాడు. దీంతో ప్ర‌చారం అల‌వోక‌గా ల‌భించేస్తుంటుంది. అయితే ఈసారి మాత్రం కొన్నేళ్ల‌క్రిత‌మే పోలీసుల చేతిలో చ‌నిపోయిన గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్‌పై వ‌ర్మ క‌న్ను ప‌డింది. వీర‌ప్ప‌న్ జీవితం ఆధారంగా ఇదివ‌ర‌కే సినిమాలొచ్చాయి. అయినా స‌రే... నా కోణంలో వీర‌ప్ప‌న్ అంటూ వ‌ర్మ `కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌` సినిమా తీస్తున్నాడు. వీర‌ప్ప‌న్‌ని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌భుత్వాలు ఎంత ఖ‌ర్చు చేసింది? పోలీసుల రికార్డుల ప్ర‌కారం ఆయ‌న ఎన్ని ఏనుగుల్ని చంపాడు? ఎంత‌మంది పోలీసుల్ని మ‌ట్టుబెట్టాడు? ఇవ‌న్నీ లెక్క‌లు చెబుతూ ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. మామూలుగా అయితే ఆ వివ‌రాల‌తో సినిమా తీస్తే ఓ డాక్యుమెంట‌రీ అవుతుంది.

కానీ వ‌ర్మ మాత్రం కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌ని జోడిస్తూ, ఆ క‌థ‌కి శివ‌రాజ్‌కుమార్‌లాంటి క‌న్న‌డ స్టార్‌ని తోడు చేసి చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఒకేసారి నాలుగు భాష‌ల్లో తెర‌కెక్కిస్తుండ‌డం కూడా క‌లిసొస్తోంది. ఆదివారమే `కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌` ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశాడు వ‌ర్మ‌. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాషల్లో `కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌`గా, హిందీలో `హంటింగ్ వీర‌ప్ప‌న్‌`గా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. విడుద‌ల చేసిన ట్రైల‌ర్ల‌లో కొత్త‌ద‌నం ఏమీ లేదు. ఇదివ‌ర‌కు ప్రెస్‌మీట్ల‌లో చెప్పిన లెక్క‌ల్నే చూపిస్తూ ఆస‌క్తి రేకెత్తించే ప్ర‌య‌త్నం చేశాడు. అలాగే ఫ్రేమ్స్ పెట్టడంలో వ‌ర్మ‌కి ఓ మార్క్ ఉంది. ఆ మార్క్‌తో కూడిన ఫ్రేమ్‌లు ట్రైల‌ర్ల‌లో క‌నిపిస్తున్నాయి. అంత‌కుమించి ట్రైల‌ర్‌లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమీ లేదు. హిందీకి సంబంధించిన స్పెష‌ల్ వ‌ర్ష‌న్ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు వ‌ర్మ ప్ర‌క‌టించాడు.