Begin typing your search above and press return to search.

భలే ట్విస్ట్.. ఆర్జీవీ ఎన్టీఆర్ శ్రీమతిని ఎంపిక చేయలేదట!

By:  Tupaki Desk   |   8 Jan 2019 9:42 AM GMT
భలే ట్విస్ట్.. ఆర్జీవీ ఎన్టీఆర్ శ్రీమతిని ఎంపిక చేయలేదట!
X
'ఆఫీసర్' తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతి దృష్టికోణంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నామని.. అసలు బయోపిక్ మాదేనని.. అన్నీ నిజాలు చూపిస్తామని వర్మ చెబుతుండడంతో అందరిలో ఈ సినిమాపై ఆసక్తి కలుగుతోంది. అసలు సినిమాలో ఏం చూపిస్తాడో తెలుసుకోవాలని చాలామంది జనాలు కుతూహలంగా ఉన్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి 'వెన్నుపోటు' పాటను విడుదల చేసి సంచలనం సృష్టించిన వర్మ తాజాగా మరో పాటను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడట. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. అదేంటంటే.. వర్మగారు ఇప్పటివరకూ లక్ష్మి పార్వతి పాత్ర పోషించే నటిని ఎంపిక చెయ్యలేదట. ఒక వివాదాస్పద నటిని ఎంపిక చేసేందుకు రెడీ అయినా.. ఈ సినిమా నిర్మాత ఒప్పుకోకపోవడంతో వర్మ డ్రాప్ అయ్యాడట. అందుకే బాలీవుడ్ నుండి మరో నటిని ఎంపిక చేసే ప్రయత్నాలలో ఉన్నాడట. వర్మ స్పీడ్ అందరికీ తెలిసిందే..దానికి తగ్గట్టే జస్ట్ వారం రోజుల్లోపు లక్ష్మి పార్వతి పోర్షన్ ను ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడట.

ఇక ఎన్టీఆర్ పాత్రకు నాటకరంగంలో అనుభవం ఉన్న ఢిల్లీ బేస్డ్ నటుడిని ఎంపిక చేశాడు. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన మెజారిటీ సీన్లు ఇప్పటికే పూర్తి చేశాడని సమాచారం. ఈ సినిమాను మొదట రిపబ్లిక్ డే నాడు రిలీజ్ చేద్దామని అనుకున్నా.. ఇప్పుడు మాత్రం ఫిబ్రవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఫిబ్రవరిలో వర్మ మరో సంచలనం సృష్టించేందుకు సిద్దం అన్నమాట.