Begin typing your search above and press return to search.

`ఐస్ క్రీమ్` ఫ్రాంచైజీని వ‌దిలిపెట్ట‌ని ఆర్జీవీ?

By:  Tupaki Desk   |   16 July 2021 6:00 PM IST
`ఐస్ క్రీమ్` ఫ్రాంచైజీని వ‌దిలిపెట్ట‌ని ఆర్జీవీ?
X
ఏదో ఒక హ‌డావుడి లేనిదే ఆర్జీవీకి పూట గ‌డ‌వ‌దు! ఆయ‌న‌ 2014 లో ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీలో తక్కువ బడ్జెట్ ఎరోటిక్ థ్రిల్లర్లను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. మొదటి భాగంలో నవదీప్- తేజస్వి మాదివాడ‌ ప్రధాన పాత్రల్లో నటించగా రెండవ విడతలో మృధుల భాస్కర్ ప్రధాన పాత్ర పోషించారు.

తాజా స‌మాచారం మేర‌కు.. ఆర్జీవీ ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీలో మూడవ చిత్రం ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఐస్ క్రీమ్ 1 ..ఐస్ క్రీమ్ 2 లను నిర్మించిన సీనియర్ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ మూడవ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. తారాగణం సిబ్బంది గురించి త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

మ‌రోవైపు ఆర్జీవీ తెర‌కెక్కించిన ప‌లు సినిమాలు రిలీజ్ ల‌కు రావాల్సి ఉంది. క‌రోనా వైర‌స్- మ‌ర్డ‌ర్- 12 ఓ క్లాక్- దిశ ఎన్ కౌంట‌ర్ - ఎంట‌ర్ ది గ‌ర్ల్ డ్రాగ‌న్ -దెయ్యం ఇవ‌న్నీ ఆర్జీవీ తెర‌కెక్కిస్తున్న సినిమాలు. కానీ వీటిలో ఏది రిలీజైన‌ది క్లారిటీ రావాల్సి ఉంది. ఆర్జీవీ రూపొందించిన `బ్యూటిఫుల్` చిత్రంలో కాక‌లు పుట్టించే రేంజులో చెల‌రేగిన నైనా గంగూలీ ఆర్జీవీకే చెందిన డీకంపె‌నీ రూపొందించిన‌ `డేంజరస్` ..`జోహార్‌` అనే సినిమాల్లో న‌టించింది. ఈ సినిమాల‌ అప్ డేట్స్ తెలియాల్సి ఉంది.