Begin typing your search above and press return to search.

వ‌ర్మ నుంచి మ‌రో తుఫాన్ కొన్ని గంట‌ల్లోనే

By:  Tupaki Desk   |   30 Aug 2021 5:52 AM GMT
వ‌ర్మ నుంచి మ‌రో తుఫాన్ కొన్ని గంట‌ల్లోనే
X
సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ మ‌రో సంచ‌ల‌నానికి రెడీ అవుతున్నారు. సినిమాల‌తో పాటు వ్య‌క్తిగ‌తంగా వివాదాలు సంచ‌ల‌నాల‌కే ప్రాధాన్య‌త‌నిచ్చే వ‌ర్మ ఇటీవ‌ల కొంద‌రు క‌థానాయిక‌ల‌ను ప్ర‌మోట్ చేస్తున్న తీరు వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. ఇది ప‌బ్లిసిటీ స్టంట్ అనుకున్నా.. మ‌రో విధంగా అనుకున్నా.. ఏమ‌నుకున్నా మీ ఇష్టం అంటూ వ‌ర్మ ఓపెన్ గానే ప్ర‌తిదీ చెబుతుంటారు. చెప్ప‌క‌పోయినా దాన్ని సంచ‌ల‌నం చేయ‌డం వ‌ర్మ ఫాలోవ‌ర్స్ మీడియా ప‌నిగా మారింది. ఇక్క‌డ ఎవ‌రు రైట్.. ఎవ‌రు రాంగ్ అన్న‌ది ప‌క్క‌న‌బెడితే వ‌ర్మ మాత్రం నిత్యం వార్త‌ల్లో అగ్ర ప‌థాన నిలుస్తారు. చివ‌రికి ఆయ‌న కోరుకున్న ఉచిత ప‌బ్లిసిటీ భేషుగ్గా కుదురుతుంది. ఇది వ‌ర్మ విధానం.

వెట‌ర‌న్ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ గా ఆయ‌న ఇటీవ‌ల చెత్త సినిమాలు తీస్తున్నార‌ని విమ‌ర్శ‌లు ఉన్నా.. ఆయ‌న త‌న పంథాను మార్చుకోని సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఇటీవ‌ల‌ హీరోయిన్ల‌తో శృంగారం ఆస‌క్తుల గురించి ముచ్చ‌టిస్తూ వ‌ర్మ అటెన్ష‌న్ ని త‌న‌వైపు తిప్పుకుంటున్నారు.

ఇటీవ‌లే ఓ న‌టితో అభ్యంత‌ర‌కరంగా డాన్సులు చేసి ర‌చ్చకు తెర లేపిన సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాలో అందుకు సంబంధించిన‌ వీడియో జోరుగా వైర‌ల్ అయింది. మ‌ద్యం మ‌త్తులో వ‌ర్మ అలా చేసాడంటూ క‌థ‌నాలొచ్చాయి. దీనిపై వ‌ర్మ ఫాలోవ‌ర్స్ విమ‌ర్శించ‌గా మా ఇద్ద‌రికీ లేని నోప్పి మీకేంటి? అంటూ అంద‌రూ నోళ్లు ఒకేసారి మూయించారు. తాజాగా బిగ్ బాస్ కంటెంస్టెంట్ అషురెడ్డితో ఐస్ క్రీమ్ తింటూ ఇద్ద‌రు లైంగిక విష‌యాలు మాట్లాడుకున్న‌ట్లు మ‌రో వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఆ త‌ర్వాత అందులో ఉన్న‌ది నేను కాదని..అస‌లు వాళ్లిద్ద‌రు ఎవ‌రో నాకు తెలియ‌దంటూ వ‌ర్మ చెప్పుకొచ్చారు. ఆ రెండు రోజుల త‌ర్వాత అషురెడ్డి థై అందాల్ని ఎలివేట్ చేస్తూ తీసిన మ‌రో ఫోటోని లీక్ చేసి అందులో ఉన్న‌ది నేనేనంటూ మాట మార్చారు. ఈ ఇంట‌ర్వ్యూ కి చెందిన ఫ‌స్ట్ లుక్ ఈరోజు సాయంత్రం లోపు రిలీజ్ చేస్తాన‌ని హింట్ ఇచ్చారు. ఇలా వ‌ర్మ వింత చేష్ట‌ల‌తో మ‌రోసారి మీడియాలో మ‌రోసారి హైలైట్ అవుతున్నారు. వ‌ర్మ వింత చేష్ట‌లైనా...ఆయ‌న ఫాలోవ‌ర్స్ ప్ర‌శ్న‌లు ఎలా ఉన్నా...చివ‌రిగా వ‌ర్మ ఏది అనుకుంటున్నారో? అది మాత్రం క‌చ్చితంగా చేయ‌గ‌ల్గుతున్నారు. మ‌రి ఈ రోజు ఎలాంటి సంచ‌ల‌నంతో ముందుకొస్తారో చూద్దాం.