Begin typing your search above and press return to search.

ఆర్జీవీ ఫ‌న్! ఇంకా హీరోయిన్ల భ‌విష్య‌త్ ఏంటో?

By:  Tupaki Desk   |   9 April 2021 3:51 AM GMT
ఆర్జీవీ ఫ‌న్! ఇంకా హీరోయిన్ల భ‌విష్య‌త్ ఏంటో?
X
రామ్ గోపాల్ వ‌ర్మ అలియాస్ ఆర్జీవీలో ఫ‌న్ ఎలిమెంట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. స్పాంటేనియస్ గా పంచ్ లు వేయడం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. అత‌డు తెర‌కెక్కించిన చాలా సినిమాల్లో ఫ‌న్ అలానే వ‌ర్క‌వుటైంది. ఆయ‌న‌కు ఎలా దొరికిందో కానీ.. ఓ ఆడియో ఈవెంట్ పాత వీడియో క్లిప్ ఒక‌టి దొరికింది. ఈ వీడియోలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ .. అక్కినేని అఖిల్ మ‌ధ్య ప‌రాచికం ఎంతో ఫ‌న్ ని క్రియేట్ చేస్తోంది.

ఆ ఈవెంట్లో స్టేజీ వ‌ద్ద ఫ్రంట్ లైన్ లో తార‌క్ - అఖిల్ ప‌క్క‌ప‌క్క‌నే కూచుని ఉన్నారు. తార‌క్ ఏదో మాట్లాడుతూ అఖిల్ తొడ భాగంపై ఒక్క గిల్లు గిల్లాడు. దానికి అఖిల్ ఎంతో సిగ్గు ప‌డిపోతున్నాడు. ఈ ఫ‌న్నీ వీడియో ని తాజాగా ఇన్ స్టాలో షేర్ చేశారు ఆర్జీవీ. దీనికి త‌న‌దైన శైలిలో రొమాంటిక్ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు.

``ఇంక హీరోయిన్ల భ‌విష్య‌త్ ఏంటి? హీరోయిన్ల విష‌యంలో చాలా విచారం ఫీల‌వుతున్నా..సో శాడ్`` అంటూ శాడ్ నెస్ ఈమోజీల్ని ఆశ్చర్యం వ్య‌క్త‌ప‌రిచే ఈమోజీల్ని షేర్ చేశారు ఆర్జీవీ. ప్ర‌స్తుతం వ‌ర్మ గారి పుణ్య‌మా అని ఈ త్రోబ్యాక్ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

త‌న సినిమాల్లో న‌టించే క‌థాయిక‌ల‌తో వేదిక‌లెక్కి డ్యాన్సులేయ‌డం.. ఫోటోషూట్ల పేరుతో ఘాటైన శృంగార ర‌సాత్మ‌క ఫోటోల‌ను షేర్ చేయ‌డం.. హ‌గ్ చేసుకుని ముద్దులాడేస్తూ ఆ ఫోటోలు వీడియోల్ని వైర‌ల్ చేయ‌డం.. జుత్తుకు హెయిర్ బ్యాండ్ తో మార్ఫ్ డ్ ఫోటోల్ని షేర్ చేయ‌డం .. ఇలాంటి వెర్రివేషాలేనా? అప్పుడ‌ప్పుడు ఇలా కొత్త‌గా కొన్ని ఉంటాయ‌ని ఆర్జీవీ నిరూపిస్తున్నారు అంటూ అభిమానులు రివ‌ర్స్ పంచ్ లు వేస్తున్నారు.