Begin typing your search above and press return to search.

ఊర్మిలపై కంగనా కామెంట్స్‌.. వర్మ రియాక్షన్‌

By:  Tupaki Desk   |   17 Sept 2020 11:01 PM IST
ఊర్మిలపై కంగనా కామెంట్స్‌.. వర్మ రియాక్షన్‌
X
కంగనా తన గురించి లేదా తనపై ఎవరైనా విమర్శలు చేశారంటే అస్సలు ఊరుకోదు. అవతలి వారు ఎవరు అనే విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా తాను అనుకున్నది నిర్మొహమాటంగా అనేస్తుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ లో 90 శాతం మంది డ్రగ్స్‌ తీసుకుంటారు అంటూ కంగనా చేసిన ఆరోపణలపై జయా బచ్చన్‌ స్పందించి ఆ వ్యాఖ్యలను కొట్టి పారేసిన విషయం తెల్సిందే. జయా బచ్చన్‌ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఊర్మిళ ఈ విషయమై స్పందిస్తూ కంగనా తీరును విమర్శించింది.

బీజేపీ మద్దతు కోసం ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందేమో అంటూ అనుమానం వ్యక్తం చేసింది. ఆమె బీజేపీ సీటును ప్రయత్నిస్తుందా అంటూ ఊర్మిల ప్రశ్నించింది. ఆ వ్యాఖ్యలకు కంగనా చాలా సీరియస్‌ అయ్యింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ పోర్న్‌ స్టార్‌ టికెట్‌ సాధించగలిగితే మరాఠా గొప్పతనం చాటి చెప్పిన నేను సీటు సంపాదించడం ఏమాత్రం కష్టం కాదు అంటూ ఊర్మిలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఊర్మిల ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెల్సిందే. ఆ ఉద్దేశ్యంతో ఊర్మిలను పోర్న్‌ స్టార్‌ అంటావా అంటూ కంగనాను చాలా మంది విమర్శిస్తున్నారు. నీ నోటికి హద్దు లేకుండా పోతుంది అంటూ ఆమెకు మద్దతుగా మాట్లాడేవారు కూడా విమర్శలు కురిపిస్తున్నారు. నటిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఊర్మిలను ఇలాంటి మాటలు అనడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు. ఇలాంటివి మళ్లీ వినవద్దని ఆశిస్తున్నాను అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. మరి వర్మ రియాక్షన్‌ కు కంగనా కౌంటర్‌ ఎలా ఉంటుందో చూడాలి.