Begin typing your search above and press return to search.

`రొమాంటిక్` బ్యూటీకి వ‌ర్మ కాంప్లిమెంట్

By:  Tupaki Desk   |   30 Oct 2021 8:31 AM GMT
`రొమాంటిక్` బ్యూటీకి వ‌ర్మ కాంప్లిమెంట్
X
డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి న‌టించిన `రొమాంటిక్` స్పెష‌ల్ ప్రీమియ‌ర్ కోసం టాలీవుడ్ ద‌ర్శ‌క దిగ్గ‌జ‌లంతా థియేట‌ర్ కి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ ద‌ర్శ‌కులంతా `రొమాంటిక్` ప్రివ్యూషో వీక్ష‌ణ‌కు వ‌చ్చారు. షో అనంత‌రం అంద‌రి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. య‌థావిధిగా ద‌ర్శ‌కుల‌ నుంచి పాజిటివ్ వైబ్రేష‌న్స్ క‌నిపించాయి. సినిమా రివ్యూలు మాత్రం డివైడ్ గా వ‌చ్చినా దిగ్ధ‌ర్శ‌కులు మాత్రం ఆకాష్ ని ఆకాశానికి ఎత్తేసారు. మేకింగ్ ప‌రంగా డైరెక్ట‌ర్ అనీల్ పాడూరిని ఓ రేంజ్ లో పొగిడారు.

ఇక ఆకాష్- కేతిక శ‌ర్మ‌ల మ‌ధ్య కెమిస్ట్రీ గురించి అయితే ఏ రేంజ్ లో ఎత్తుకున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఓవ‌రాల్ గా సినిమా అనేది `పోకిరి`..`బిజినెస్ మెన్` మిక్సీలో వేసి స్క్రిప్ట్ ని రెడీ చేసి వ‌దిలిన‌ట్లు రివ్యూల్లో కొంద‌రు రాసుకొచ్చారు. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే తాజాగా వ‌ర్మ లైన్ లోకొచ్చారు. అందాల క‌థానాయిక‌ కేతిక పెర్పార్మెన్స్ పై ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ధ‌ పెట్టారాయ‌న‌. కేతిక‌పై త‌న‌దైన శైలి రివ్యూని ఇచ్చారు. ఆకాష్ పూరి రొమాంటిక్ థండ‌ర్అ ని..కేతిక ని రొమాంటిక్ హాట్ బ్యూటీ అని కితాబిచ్చారు. ఇద్ద‌రు అద్భుత‌మైన‌ కెమిస్ట్రీతో బాక్సాఫీస్ ని బర్న్ చేసార‌న్నారు. ద‌ర్శ‌కుడు అనీల్ కి.. నిర్మాత‌లు పూరి-చార్మికి సెల్యూట్ చేసారు.

ట్వీట్ చేసిన‌ వ‌ర్మ కి కేతిక థాంక్స్ చెప్పింది. దీనికి మ‌ళ్లీ రిప్లై గా వ‌ర్మ ``హే కేతిక మాకు హాట్ అండ్ రొమాంటిక్ పీల్ తెప్పించింనందుకు నీకు నేను..ఆడియ‌న్స్ థాంక్స్ చెప్పాల‌``ని అన్నారు. మొత్తానికి య‌వ నాయిక మొద‌టి సినిమాతోనే వ‌ర్మ లాంటి పెద్ద ద‌ర్శకుడిని మెస్మ‌రైజ్ చేసింది. అన్న‌ట్టు.. ఇలాంటి బ్యూటీల‌పై వ‌ర్మ కాన్సంట్రేష‌న్ స్పెష‌ల్ గా ఉంటుంది. ఇలాంటి వర్ధ‌మాన నాయిక‌ల‌కు వ‌ర్మ అవ‌కాశాలు ఇవ్వ‌కుండా వ‌దిలిపెట్ట‌రు. ప్ర‌త్యేకంగా పార్టీలు సైతం ఏర్పాటు చేసి వాళ్ల‌ని ప్ర‌మోట్ చేసే బాధ్య‌త‌ల్ని కూడా ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. మ‌రి కేతిక కోసం వ‌ర్మ అలాంటి పార్టీ ఏదైనా ఏర్పాటు చేస్తారేమో చూడాలి. కొంప‌దీసి వ‌ర్మ డీకంపెనీలో కేతిక జాయిన్ కావ‌డం లేదు క‌దా?

ఆకాష్ పూరి సరసన `రొమాంటిక్` చిత్రంతో కొత్త భామ కేతిక‌ను ప‌రిచ‌యం చేసారు పూరి. ఇంత‌కీ ఎవ‌రీ బ్యూటీ అంటే.. అంద‌రిలాగే ముంబై నుంచి వ‌చ్చింది. ముంబై లో మోడల్ గా కెరీర్ ని సాగిస్తున్న కేతిక‌కు సోష‌ల్ మీడియాల్లో చ‌క్క‌ని ఫాలోయింగ్ ఉంది. కేతిక శ‌ర్మ మోడ‌ల్ గా.. టీవీ న‌టిగా సుప‌రిచితం. కేతిక‌ ఇన్ స్టాగ్రమ్ లో స్పీడ్ గానే ఉంటోంది. అక్కడ నిరంతరం కొత్త కొత్త ఫోటోలు.. వీడియోల్ని షేర్ చేస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. కేతిక ఇటీవలే జిమ్ముల్లో కసరత్తులు చేస్తున్న ర‌క‌ర‌కాల‌ వీడియోల‌తోనూ వేడి పెంచింది. ప్ర‌స్తుతానికి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో శర్మా గాళ్ కి ట‌చ్ లో ఉన్నారు.

`కిచెన్ డైరీస్` పేరుతో కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్ ని కేతిక షేర్ చేయగా ఇటీవల వైర‌ల్ అయ్యింది. అయితే ఎంద‌రో హాట్ భామ‌ల్ని పూరి తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసినా కొంద‌రే నిల‌దొక్కుకోగ‌లిగారు. మ‌రి లేటెస్టుగా రిలీజైన రొమాంటిక్ కి డివైడ్ టాక్ వ‌చ్చిన నేప‌థ్యంలో టాలీవుడ్ టాప్ లిస్ట‌ర్ జాబితాలో కేతిక పేరు నిలుస్తుందా.. లేదా? అన్న‌ది చూడాలి. ఇక‌పోతే రొమాంటిక్ లో న‌టిస్తుండ‌గానే కేతిక‌కు టాలీవుడ్ లో ప‌లువురితో అవ‌కాశాలొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇత‌ర భాష‌ల్లోనూ కేతిక‌కు అవ‌కాశాలొస్తున్నాయి.