Begin typing your search above and press return to search.

ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గ‌ర్ కొడుకు కాదు..?

By:  Tupaki Desk   |   23 May 2021 4:44 AM GMT
ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గ‌ర్ కొడుకు కాదు..?
X
ఆర్జీవీనా మ‌జాకానా? ఆయ‌న ఒక ట్వీటేశారంటే జింతాత జింతాతే! ఇప్పుడు యువ‌హీరో అల్లు శిరీష్ పైనా ఆయ‌న ఒక ట్వీట్ వేశారు. ట్వీట్ లో మ‌రీ క‌టువైన ప‌దాల్ని ఉప‌యోగించినా కానీ అది నిజంగా శిరీష్ కి మైలేజ్ పెంచేదే సుమీ!

అల్లు శిరీష్ జిమ్ లో ష‌ర్ట్ లెస్ లో క‌నిపిస్తున్న ఓ ఫోటోని షేర్ చేసి దానిపై ఆర్జీవీ త‌న‌దైన శైలి అన్య భాషా ప‌ద‌జాలంతో కామెంట్ చేశారు. ``ఈ నా.. కొ... కొనాన్ ది బార్బేరియ‌న్ .. ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గ‌ర్ కొడుకు కాదు? అల్లు అర‌వింద్ కొడుకు.. అల్లు సార్ మీ .. కి జోహార్!! `` అంటూ ఘాటైన ప‌ద‌జాలం ఉప‌యోగించారు.

నిజానికి ఆర్జీవీ ఇంటెన్షన్ ఏదైనా కానీ.. శిరీష్ కండ‌లు పెంచిన తీరును ప్ర‌శంసించే ఉద్ధేశ‌మే ఇది. ఇటీవ‌లి కాలంలో శిరీష్ కంబ్యాక్ కోసం చాలా ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. జిమ్ లో నిరంత‌రం శ్ర‌మిస్తూ త‌న లుక్ ని మార్చుకునే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టికే మెలితిరిగిన కండ‌ల‌తో లుక్ ప‌రంగా బెట‌ర్ మెంట్ క‌నిపిస్తోంది. షోల్డ‌ర్ .. బైసెప్స్.. ట్రైసెప్స్ ని మార్చుకుని శ‌రీరాన్ని మ‌లుచుకున్న తీరు ఆక‌ట్టుకుంటోంది.

పొగిడారో తిట్టారో లాజిక్ కి అందని మ్యాజిక్ అది ఇంకా అవి మాటలా భూతులా అర్ధం కాలేదు.. అని ఒక అభిమాని ప్ర‌తిస్పంద‌న‌గా కామెంట్ చేశారు. బ‌హుశా ఆర్జీవీకి ఏ ఎమోష‌న్ త‌న్నుకు వ‌చ్చినా ఆగ‌రు. అందుకే ఇలా ఎమోష‌న‌ల్ గా బ‌ర‌స్ట్ అయ్యార‌ని అనుకోవ‌చ్చ‌న్న‌మాట‌!! ఇక అల్లు ఫ్యాన్స్ ఆర్జీవీని నెగెటివ్ కోణంలో కాకుండా పాజిటివ్ కోణంలోనూ ఆర్జీవీని అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో!!