Begin typing your search above and press return to search.

మిలియన్ల వైపు పరుగులు పెడుతున్న వర్మ క్లైమాక్స్ టీజర్

By:  Tupaki Desk   |   16 May 2020 12:10 PM GMT
మిలియన్ల వైపు పరుగులు పెడుతున్న వర్మ క్లైమాక్స్ టీజర్
X
వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వివాదాలకు తెరలేపడమే కాదు.. వివాదాస్పద సినిమాలు రూపొందించడంలో కూడా తోపు. ఈ మధ్యకాలంలో వర్మ చేసిన సినిమాల‌న్నీ వివాదాల్లో చిక్కుకుని వరుసగా పరాజయం పాలయ్యాయి. వర్మ సినిమాలు ఏ నేప‌థ్యంలో వ‌చ్చినా ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. ఆయన సినిమాలు మొదలైనప్పటి నుండి విడుదల అయ్యేవరకు మీడియాకు వర్మ సినిమాల గురించి పెద్ద పనే ఉంటుంది. ఇక లాక్ డౌన్ టైంలో తాజాగా మరో భిన్నమైన సస్పెన్స్ సినిమాతో ప్రేక్షకుల‌ ముందుకు రాబోతున్నాడు వర్మ. శృంగారతార మియా మల్కోవాను ప్రధాన పాత్రధారిగా ‘క్లైమాక్స్‌’ అనే శృంగారభరిత యాక్షన్ థ్రిల్ల‌ర్‌ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తం ఓ ఎడారి నేపథ్యంలో సాగే ప్రేమ జంట కథ అని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.

ఈ సినిమాలో కుర్రకారుకి కిక్కిచ్చే అందాల‌ ఆరబోత ఓ రేంజ్ లో ఉంది. శృంగార తార మియా మల్కోవా విసిరే అందాల బాణాలు ఫ్యాన్స్ గుండెల్లోకి నేరుగా దూసుకుపోతున్నాయి. ఇటీవలే ఈ షార్ట్ ఫిల్మ్ టీజర్ యూట్యూబ్ లో విడుదల చేసాడు వర్మ. ఈ సినిమా టీజర్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల‌ చేశారు వర్మ. క్లైమాక్స్ టీజర్ లో మియా త‌న విశ్వ‌రూపాన్ని చూపించిందని చెప్పాలి. ఎడారిలో ఒయాసిస్సులాగా లాక్ డౌన్ లో బోర్ గా ఫీలవుతున్న కుర్ర హృదయాలను ఇట్టే దోచేసుకుంది గుమ్మ. ఇక ఈ క్లైమాక్స్ టీజర్.. మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో పరుగులు తీస్తోంది. ఇంతవరకు వర్మ తీసిన ఏ మూవీ కూడా ఈ రికార్డు క్రియేట్ చేయలేక పోయాయి. ఇక క్లైమాక్స్ అసలు ట్రైలర్.. మే 18 ఉదయం 9.30 గంటల‌కు విడుదల‌ కాబోతోందని ఈ టీజర్‌లోనే ఎనౌన్స్‌ చేసి ఆసక్తి రేపాడు ఆర్జీవీ. ఈ ఫిల్మ్ ను కంపెనీ, ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్నాయి. ఇక మరోసారి వర్మలోని మొగలి పువ్వు విచ్చుకుందని ఫ్యాన్స్ చెప్తున్నారు.