Begin typing your search above and press return to search.

ఒంట్లో క‌కార‌వికారాల్ని బ‌య‌ట పెట్టిన ఆర్జీవీ

By:  Tupaki Desk   |   21 Jun 2021 3:30 AM GMT
ఒంట్లో క‌కార‌వికారాల్ని బ‌య‌ట పెట్టిన ఆర్జీవీ
X
యూట్యూబ్ ఇంట‌ర్వ్యూవ‌ర్ అరియానాతో ఆర్జీవీ ప‌రిచ‌యం అనంత‌ర ప‌రిణామాలు తెలిసిందే. బిగ్ బాస్ పార్టిసిపెంట్ గా అరియానాకు ఆర్జీవీ నుంచి పూర్తి మ‌ద్ధ‌తు ల‌భించింది. ఇప్పుడు ఆ ఇద్ద‌రి ప‌రిచ‌యానికి నెటిజనులు ఎఫైర్ అంటూ ఆరోప‌ణ‌లు చేశారు. ఎవ‌రికి న‌చ్చింది వాళ్లు చేయాలి! అంటూ ఆర్జీవీ కూడా కౌంట‌ర్లు వేశారు.

ఇక‌పోతే ఆర్జీవీతో అరియానా ఇంట‌ర్వ్యూ ఈ శ‌నివారం యూట్యూబ్ లో రిలీజ్ చేయ‌గా అది వైర‌ల్ అయ్యింది. అరియానాతో ఆర్జీవీ బోల్డ్ ఇంట‌ర్వ్యూలో మ‌గువ దేహంపై ఆర్జీవీ కామెంట్లు .. సెక్స్ కామెంట్లు వగైరా వ‌గైరా యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఆర్జీవీ .. అరియానా ఇద్ద‌రూ ఇద్ద‌రూ .. టూమ‌చ్ బోల్డ్ కామెంట్ల‌తో చెల‌రేగ‌డంతో 10ల‌క్ష‌ల వ్యూస్ తో ఇంట‌ర్వ్యూ ఇప్ప‌టికే బంప‌ర్ హిట్ట‌య్యింది. ఇక ఈ ఇంట‌ర్వ్యూ ఆద్యంతం అరియానా దేహ‌శిరుల‌పైనే కెమెరా క‌ళ్లు ఫోక‌స్ చేయ‌డంతో అది యువ‌త‌రానికి ఇట్టే క‌నెక్ట‌యిపోయింది.

అరియానా శ‌రీరంలో ఇంచి ఇంచి కెమెరా కంట బంధీ అయ్యింది. ఈ బ్యూటీ న‌డుమందం.. వీపందం.. ఎద అందాలు.. పిరుదుల సౌంద‌ర్యంపైనే ఫోక‌స్ పెట్టింది ఆ కెమెరా. ఈ ఇంట‌ర్వ్యూలో జిమ్ చేయ‌డం కంటే అరియానా ఒంపుసొంపుల‌పైనే ఆర్జీవీ ఎక్కువ ఫోక‌స్ పెట్టార‌ని వీక్ష‌కుల‌కు అర్థ‌మైంది.

హ‌ద్దులు చెరిపేసిన‌ చిట్ చాట్ వీడియోలో సెక్స్ గురించిన సంభాషణల్లో ఇద్దరూ పోటీప‌డ్డారు. ఆర్జీవీ ప‌చ్చిప‌చ్చిగా పిచ్చిగా మాట్లాడిన ప్ర‌తిదీ యూత్ కి క‌నెక్ట‌యిపోయాయి. ఒక‌ర‌కంగా యూత్ లో క‌కార‌వికారాల్ని ఆర్జీవీ బ‌య‌ట‌పెట్టాడు! ``నాకు నీ బాడీలో ఏ పార్ట్ అంటే ఇష్టం అనుకుంటున్నావో చెప్పు`` అని ఆరియానానే ప్ర‌శ్నించాడు ఆర్జీవీ.

``మీరు నా తొడల గురించే ఎక్కువగా కామెంట్స్ చేస్తారు... సో.. మీకు నా థైస్ అంటే ఇష్టం అనుకుంటున్నా`` అని ఆరియానా జ‌వాబివ్వ‌గా..``ఛ ఛ.. అది ఒకప్పుడు ... ఇప్పుడు మాత్రం నీ పిరుదులు అంటే ఇష్టం`` అని ఆంగ్లంలో కొంద‌రికి అర్థం అయ్యీ అవ్వ‌న‌ట్టు క‌న్ఫ్యూజ్ చేశాడు ఆర్జీవీ. మొత్తానికి ఈ బోల్డ్ ఇంట‌ర్వ్యూలో చాలా కొంటె ప్ర‌శ్న‌లు రొమాంటిక్ ఆన్స‌ర్లు చూసేవాళ్ల‌కే సిగ్గు ప‌డే ట్రీటిచ్చాయి. ఇంట‌ర్వ్యూ బంప‌ర్ హిట్ చేయాలంటే ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ ని పుష్క‌లంగా వండి వార్చారు ఆర్జీవీ.