Begin typing your search above and press return to search.

స్వప్నను కూడా 'వర్మ' స్పార్క్ లోకి లాగారే

By:  Tupaki Desk   |   9 April 2021 9:51 AM GMT
స్వప్నను కూడా వర్మ  స్పార్క్ లోకి లాగారే
X
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఆయన ఆలోచల్లో అంతరార్దం, అర్దం వెతికే ధైర్యం ఎవరూ చెయ్యరు. విభిన్నత, అసభ్యతను తన ఆయుధాలుగా చేసుకుని లాక్‌డౌన్ సమయంలోనూ నగ్నం, మర్డర్ లాంటి చిత్రాలు తెరకెక్కించి ఓటీటీ వేదికగా విడుదల చేయడం రామ్ గోపాల్ వర్మకే చెల్లింది. అలాగే హరర్ సినిమాలతో ఆడియన్స్‏ను అదే రేంజ్‏లో భయపెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అయితే గత కొంత కాలంగా ఆర్జీవి తన రూటు మార్చుకున్నాడు. కేవలం కాంట్రావర్సి సినిమాలపైనే ఫోకస్ చేశాడు ఆర్జీవి. ఇవే కాకుండా.. లాక్ డౌన్ సమయంలో ఏకంగా ఫోర్న్ వీడియాను తలపించేలా సినిమాలను తెరకెక్కించి అందిరికి షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో తను డైరక్ట్ చేసే మెటీరియల్ కు సొంత ఓటీటి ఉంటే బెస్ట్ అని భావించినట్లున్నారు.

దాంతో ఇప్పుడు ఆయన సొంతంగా స్పార్క్ పేరుతో ఓ ఓటీటి ప్లాట్ పామ్ ని లాంచ్ చేయబోతున్నారు. అందుకు ఆయన సీనియర్ జర్నలిస్ట్ స్వప్న సాయిం తీసుకోబోతున్నారు. ఈ మేరకు ఆయన ఆమెను ఒప్పించి, ఆ విషయాన్ని ఖరారు చేస్తూ ట్వీట్ కూడా చేసారు. ఆమే ఈ ఓటీటికి సంభందించిన ఆపరేషన్స్ అన్నీ చూడబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ ఈ ఓటీటికు ఎక్సక్లూజివ్ కంటెంట్ ని రాబోయే రోజుల్లో చేయబోతున్నారు. ఈ ఓటీటీ ఎంతో మంది కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వబోతోందిట. టాలెంట్ ఉన్న వాళ్లను ఆహ్వానించి మరీ పోగ్రామ్ లు చేయబోతున్నరట. త్వరలోనే ఈ మేరకు ఓ ప్రకటన కూడా రిలీజ్ చేయబోతున్నారు.

ఇక స్వప్న టీవి 9లో ఉండగా అక్కడా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఎస్వీబీసీ డైరెక్టర్‌గా ఉన్న స్వప్న గతంలో సాక్షి టీవీకి ఫేస్ ఆఫ్ ద ఛానెల్ గా ఉన్నారు. వైఎస్సార్సీపీ పార్టీ విజయంలో స్వప్న కూడా జర్నలిస్ట్ గా ప్రముఖ పాత్ర పోషించారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ టీవీ ఛానల్‌లో పనిచేస్తున్న ఆమె ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను రామూయిజం పేరుతో వరస ఇంటర్వూలు చేసారు. ఆ ఇంటర్వూలు చాలా పాపులర్ అయ్యాయి . అప్పుడే ఆమెకు,వర్మకు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సంగీతం, సాహిత్యంతో పాటు వివిధ భాషలపై పట్టు ఉన్న స్వప్న ఆధ్వర్యంలో ఓటీటి మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉందని ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ స్పార్క్ లో ఏమి రిలీజ్ చేస్తారో..ఎలాంటి కంటెంట్ కు ప్రాధాన్యత ఇస్తారో చూస్తే కానీ అది స్దాయిలో క్లిక్ అవుతుందో చెప్పలేము.