Begin typing your search above and press return to search.

ల‌క్ష్మీస్ NTR 2 ఇదేం ట్విస్టు!

By:  Tupaki Desk   |   29 April 2019 3:21 PM IST
ల‌క్ష్మీస్ NTR 2 ఇదేం ట్విస్టు!
X
`ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ఏపీలో వాయిదా మాటేమో కానీ.. ఆర్జీవీ చేస్తున్న హంగామా మామూలుగా లేదు. ప్ర‌స్తుతం ఆర్జీవీ హైరానాపై మీడియాలో ఆస‌క్తిక‌ర డిబేట్ సాగుతోంది. ఆదివారం రోజంతా విజ‌య‌వాడ రోడ్ల‌పై ఆర్జీవీ సృష్టించిన హంగామా మొద‌లు.. నేడు హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్ ప్రెస్ మీట్ వ‌ర‌కూ.. ప్ర‌తి ఏపిసోడ్‌ రక్తి క‌ట్టించాయి. మీడియాకి కావాల్సినంత ఆమ్యామ్యాని అందించారు ఆర్జీవీ. ఇక ట్విస్టులో ట్విస్టు అన్న‌ట్టుగా ఆర్జీవీ `ల‌క్ష్మీస్ NTR` పార్ట్ 2 స్క్రిప్టు రాశాన‌ని ప్ర‌క‌టించ‌డం!! ఇంకా ర‌క్తి క‌ట్టించింది.

అస‌లు ఆర్జీవీ అనే మాట‌ల్ని ఎవ‌రూ న‌మ్మ‌రు. అంత నిక్క‌చ్ఛిగా మాట మీద నిల‌బ‌డే ర‌కం కాద‌న్న వాద‌నా మీడియాలో ఉంది. అయితే ప్ర‌సాద్ లాబ్స్ ప్రెస్ మీట్ లో సినీమీడియా నుంచి ఆర్జీవీకి ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. బెజ‌వాడ రోడ్ల పై ఆ ఏడు గంట‌లు ఏం చేశారు ఆర్జీవీ? అన్న ప్ర‌శ్న‌కు.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ కి సీక్వెల్ స్క్రిప్టు రాసాన‌ని.. `బిహైండ్ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` టైటిల్ తో తెర‌కెక్కిస్తాన‌ని వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. ఇంత‌కీ ఆర్జీవీ తాను చెప్పిన‌ట్టే సీక్వెల్ కూడా తీస్తారా? అంటే `జ‌స్ట్ ఫ‌ర్ జోక్!` అని తేల్చేశారు.

ఇక ఈ ప్రెస్ మీట్‌ లో బోలెడ‌న్ని ఆర్జీవీ మార్క్ చెణుకులు వినోదాన్ని అందించాయి. ద‌మ్ముంటే అని మీరు ఛాలెంజ్ విస‌ర‌డం వ‌ల్ల‌నే ఇన్ని ఎపిసోడ్స్ కి దారి తీసిందా? అన్న ప్ర‌శ్న‌కు..``ద‌మ్ముంటే ఆపండి`` అని నేనెప్పుడూ అన‌లేద‌ని అన్నారు ఆర్జీవీ. అది మీ ఊహ మాత్ర‌మేన‌ని అన్నారు. ``పెద్దాయ‌న ఆప‌క‌పోతే.. మాఫియాని మేం హ్యాండిల్ చేస్తాం. పాల‌కులే మాఫియాలా ప్ర‌వ‌ర్తిస్తే మేమేమీ చేయ‌లేం`` అని రిలీజ్ మ్యాట‌ర్ మాట్లాడారు ఆర్జీవీ. ఏపీలో ప్ర‌జాస్వామ్యం లేద‌ని ట్వీట్ చేశారు క‌దా? అన్న ప్ర‌శ్న‌కు.. ఒక పౌరుడిగా అలా అడిగే హ‌క్కు త‌న‌కు ఉంద‌ని అన్నారు. ఎవ‌రైతే న‌న్ను ఆపాల‌ని చూశారో వాళ్లంతా ఎన్టీఆర్ వెన్నుపోటును తెర‌పై నిండుగా చూసుకోవ‌చ్చ‌ని సెల‌విచ్చారు ఆర్జీవీ.

విజ‌య‌వాడ ప్రెస్ మీట్ అనంత‌ర ప‌రిణామాల‌పై వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్పందించారు క‌దా? దానిపై మీ అభిప్రాయం ఏమిటి? అని ప్ర‌శ్నిస్తే.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా కాకుండా ఒక సాధార‌ణ వ్య‌క్తిగానే తాను స్పందించార‌ని ఆర్జీవీ అన్నారు. వైసీపీలో చేర‌తారా? అన్న ప్ర‌శ్న‌కు.. అందుకు ఆస్కార‌మే లేద‌ని అన్నారు. వైసీపీలో చేదేది లేద‌ని ఖ‌రాకండిగా మీడియాకి ప్రామిస్ చేశారు ఆర్జీవీ.