Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన డైరెక్టర్...!

By:  Tupaki Desk   |   18 July 2020 2:30 PM GMT
పవర్ స్టార్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన డైరెక్టర్...!
X
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వాస్తవ సంఘటనలు.. నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఒకప్పుడు మంచి నేపథ్యాన్ని తీసుకుని సూపర్ హిట్ సినిమాలు తీసి సంచలనాలు క్రియేట్ చేసిన వర్మ గత కొన్నేళ్లుగా వివాదాస్పద చిత్రాలను రూపొందిస్తూ సంచలనం రేపుతున్నాడు. ఈ క్రమంలో 'పవర్ స్టార్' అనే కాంట్రవర్సీ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 'పవర్ స్టార్' అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పిలుస్తూ ఉంటారని యావత్ సినీ అభిమానులకు తెలుసు. అయినప్పటికీ వర్మ మాత్రం ఈ సినిమా నిజ జీవితంలోని ఏ వ్యక్తిని ఉద్దేశించి తీస్తుంది కాదని.. పొలిటికల్ పార్టీ స్థాపించి ఎన్నికలలో ఓడిపోయిన ఓ స్టార్ హీరో స్టోరీ అని.. ఏ వ్యక్తికైనా దగ్గర పోలికలు ఉంటే అది యాదృచ్చికంగా జరిగింది మాత్రమేనని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికే 'పవర్ స్టార్' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ త్వరలోనే ఈ సినిమాని ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు తాజాగా "పవర్ స్టార్" మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు వర్మ.

వర్మ ట్విట్టర్ వేదికగా 'పవర్ స్టార్' సినిమా జూలై 25న ఉదయం 11 గంటల నుంచి www.rgvworldtheatre.com థియేటర్లో స్ట్రీమింగ్ కాబోతోందని వెల్లడించారు. ఈ సినిమా పే ఫర్ వ్యూ పద్ధతిలోనే చూడాలని పేర్కొన్నారు. అంతేకాకుండా త్వరలోనే అప్సర రాణి నటించిన హిందీ మూవీ 'థ్రిల్లర్' కూడా ఈ థియేటర్ లో విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' లోగో కూడా రిలీజ్ చేసిన వర్మ.. ఇందులో విడుదల కాబోతున్న ఫస్ట్ మూవీ 'పవర్ స్టార్' అని చెప్పుకొచ్చాడు. నిజానికి ఇంతకముందు శ్రేయాస్ ఎంటర్టైన్మెంట్ వారితో కలిసి ఆర్జీవీ వరల్డ్ థియేటర్ క్రియేట్ చేశారు. 'క్లైమాక్స్' 'నగ్నం' సినిమాలు అందులోనే రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు వర్మ సెపరేట్ గా ఓన్ థియేటర్ క్రియేట్ చేసినట్లు అర్థం అవుతోంది. కారణాలు ఏంటో తెలియదు కానీ వర్మ శ్రేయాస్ వారితో తెగదెంపులు చేసుకున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే www.rgvworldtheatre.com క్రియేట్ చేసి "పవర్ స్టార్" "థ్రిల్లర్" సినిమాలు రిలీజ్ చేస్తున్నాడని అంటున్నారు.