Begin typing your search above and press return to search.

వ‌ర్మ విత్ వోడ్కా కాదా? అప్స‌ర‌!

By:  Tupaki Desk   |   19 May 2022 5:08 AM GMT
వ‌ర్మ విత్ వోడ్కా కాదా? అప్స‌ర‌!
X
`వోడ్కా విత్ వ‌ర్మ` పుస్త‌కం ఎంతలా ఫేమ‌స్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. అందులో వ‌ర్మ వోడ్కా ర‌హ‌స్యాన్ని ఎంతో గొప్ప‌గా వ‌ర్ణించారు. ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత సిరాశ్రీ ర‌చ‌న‌ల్లో వ‌ర్మ‌పై ఇదొక ర‌చ‌న‌. ఈ పుస్త‌కానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వ‌ర్మ‌ని అభిమానించే వాళ్లంతా వోడ్కా ర‌హ‌సం తెలుసుకోవ‌డం కోసం తెగ ప‌ఠించేస్తుంటారు.

వ‌ర్మ‌కి ఇష్ట‌మైన మ‌ద్యం బ్రాండ్ వోడ్కా. స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా త‌న బ్రాండ్ గురించి వ‌ర్మ త‌న‌దైన శైలిలో చెబుతుంటారు. వ‌ర్మ వోడ్కా తీసుకుంటున్న‌ స‌మ‌యంలో వ‌చ్చిన ఫోటోలు కోకొల్ల‌లు. ఇందులో ఎలాంటి దాపరికాలు లేవు. వర్మ‌లో ఈ నైజం గురించి ఆయ‌నే స్వ‌యంగా చెబుతారు కాబ‌ట్టి విష‌యం క్లియ‌ర్ గా ఉంటుంది.

తాజాగా నెట్టింట ఓ ఫోటో వైర‌ల్ అవుతోంది. న‌టి అప్స‌ర‌తో క‌లిసి వ‌ర్మ మ‌ద్యం సేవిస్తున్న ఫోటో ఒక‌టి లీక్ అయింది. అందులో అప్స‌ర హాట్ డ్రెస్ లో నుంచుని వ‌ర్మ భుజాల‌పై ఓ చేయి వేసి..మ‌రో చేతితో గ్లాస్ ప‌ట్టుకుంది. ఇక వ‌ర్మ ఒక చేతితో అప్సర న‌డుముని గ‌ట్టిగా లాగి పట్టుకుని మ‌రో చేత్తో మ‌ద్యం గ్లాస్ తో క‌నిపిస్తున్నారు. అయితే ఈ గ్లాసుల్లో ఉన్న క ల‌ర్ చేంజ్ క‌న్ ప్యూజ‌న్ క్రియేట్ చేస్తుంది. రెండు వేర్వేరు రంగుల్ని క‌లిగి ఉన్నాయి. దీంతో అవి కూల్ డ్రింక్స్ అన్న సందేహం కూడా వ్య‌క్తం అవుతుంది.

ఇద్ద‌రు జంట‌గా కెమెరాకి న‌వ్వుతూ ఫోజులిచ్చారు. అప్స‌ర‌-వ‌ర్మ‌ల మ‌ధ్య ఇలాంటి కెమిస్ర్టీ కొత్తేం కాదు. ఇద్ద‌రు మంచి స్నేహితులుగా మెలుగుతారు. ద‌ర్శ‌కుడు..న‌టి అన్న భావ‌న క‌న్నా...గుడ్ ప్రెండ్స్ అన్న త‌ర‌హాలో ఉంటారు. ఒడిశా బ్యూటీ అప్స‌ర‌ని ప‌రిచ‌యం చేసింది వ‌ర్మ‌నే. అప్స‌ర‌ని ప్ర‌ధాన పాత్ర‌లో పెట్టి వ‌ర్మ ఇప్ప‌టికే సినిమా కూడా చేసారు.

ఆమెని పైకి తీసుకొచ్చే బాధ్య‌త‌లు వ‌ర్మ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కెరీర్ ప్రారంభం ద‌గ్గ‌ర నుంచి అప్స‌ర వ‌ర్మ వెంటే న‌డుస్తుంది. ఆయ‌న కాంపౌండ్ లోనే సినిమాలు చేస్తుంది. అలాగే అప్స‌ర‌తో పాటు ఇంకొంత మంది వ‌ర్ద‌మ‌న న‌టీమ‌ణులు కూడా వ‌ర్మ‌ని అనుస‌రిస్తున్న జాబితాలో ఉన్నారు.