Begin typing your search above and press return to search.

వావ్ వర్మ... బాహుబలి, ఆర్ఆర్ఆర్ ల గురించి ఒక్క మాటలో తేల్చేశాడు

By:  Tupaki Desk   |   27 March 2022 2:01 PM IST
వావ్ వర్మ... బాహుబలి, ఆర్ఆర్ఆర్ ల గురించి ఒక్క మాటలో తేల్చేశాడు
X
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఈమద్య కాలంలో తన వివాదాస్పద ట్వీట్స్ ను.. రెచ్చగొట్టే వైకరిని పక్కన పెట్టినట్లుగా ఉన్నాడు. కొన్ని విషయాల పట్ల తనదైన శైలిలో స్పందిస్తూ ఉన్నాడు కాని మెజార్టీ విషయాల పట్ల చాలా నాజూకుగా స్పందిస్తూ ఉన్నాడు. తన సహజ సిద్దమైన వైఖరి కాకుండా విభిన్నంగా ఈయన ట్వీట్స్ చేస్తూ ఉంటే అంతా కూడా షాక్ అవుతున్నారు.

ఆ మద్య ది కశ్మీర్‌ ఫైల్స్ అనే సినిమా పై ప్రశంసలు కురిపించాడు. ఆ సినిమా యొక్క గొప్పతనం గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాకు సంబంధించి కూడా పాజిటివ్‌ గానే స్పందించాడు. బాహుబలి సినిమా తో పోల్చుతూ ఆర్‌ ఆర్ ఆర్‌ కు అంత స్థాయి లేదు అనే అర్థం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసినా కూడా ఆర్‌ ఆర్‌ ఆర్‌ విషయంలో ఆయన పాజిటివ్‌ గానే ఉన్నాడు అనేది ఆ ట్వీట్‌ ద్వారా అర్థం అయ్యింది.

రామ్‌ గోపాల్‌ వర్మ ట్విట్టర్ లో.. బాహుబలి 2 అనేది ఒక చరిత్ర... ఆర్ఆర్ఆర్ అనేది చారిత్రాత్మకం. రాజమౌళి ఇలాంటి అద్బుతాలను ఆవిష్కరించినందుకు నీకు దండం అంటూ తనదైన శైలిలో ఈమోజీలను షేర్ చేశాడు. రామ్‌ గోపాల్‌ వర్మ ట్వీట్ చూస్తే నిజమే కదా అనిపిస్తుంది. బాహుబలి 2 అనేది చరిత్రలో నిలిచి పోయే సినిమా. వసూళ్ల పరంగానే అయినా.. మరో విధంగా అయినా కూడా బాహుబలి 2 ఒక చరిత్రగా ప్రతి ఒక్కరు అనుకుంటారు.

ఇక రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ లు నటించిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా మాత్రం చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన గొప్ప చిత్రం అనేది వర్మ ఉద్దేశ్యం. ఆ ఉద్దేశ్యంతోనే ఈ ట్వీట్‌ చేశాడు. ఈ సినిమా లు రెండు కూడా తెలుగు సినిమా యొక్క గొప్పతనంను చాటి చెప్పకనే చెబుతున్నాయి. ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా రాజమౌళి తన యొక్క గొప్ప టెక్నాలజీని.. టెక్నీషియన్ ను చూపించాడు అనడంలో సందేహం లేదు.

ఇక ఇద్దరు హీరోల నటన కూడా న భూతో అన్నట్లుగా ఉంది. ఇద్దరు కెరీర్‌ బెస్ట్‌ ఇచ్చారు. రాజమౌళి సినిమా చూసే వారికి రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ లను చూపించకుండా అల్లూరి సీతా రామ రాజు మరియు కొమురం భీమ్‌ లను చూపించాడు. అద్బుతమైన సినిమా అనడంలో ఎలాంటి డౌట్ లేకుండా ఆర్‌ ఆర్ ఆర్‌ ను తెరకెక్కించాడు. వర్మ మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది గొప్ప దర్శకులు కూడా సినిమా పై ప్రశంసల జల్లు కురిపించారు.