Begin typing your search above and press return to search.

12 'O' క్లాక్ తో భయపెడతానంటున్న వర్మ...!

By:  Tupaki Desk   |   3 July 2020 3:00 PM IST
12 O క్లాక్ తో భయపెడతానంటున్న వర్మ...!
X
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తాడో.. ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ఎవరికీ తెలియదు. సడెన్ సర్ప్రైజ్ లా ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ అంటూ సినిమా అనౌన్స్ చేసేస్తాడు. ఇక వర్మ సినిమా కంటే ముందే టైటిల్స్‌ తోనే ఆయా సినిమాలపై ప్రేక్షకులు చర్చించుకునేలా చేసి హైప్ క్రియేట్ చేస్తారు. నిజానికి ఈ టెక్నిక్ వర్మకు తెలిసినంతగా ఇంకెవ్వరకీ తెలియదని చెప్పవచ్చు. సినిమాలో విషయం ఉందో లేదో అనే విషయం పక్కనపెడితే టైటిల్ తోనే సినిమాకి బజ్ తీసుకొస్తాడు. ఈ క్రమంలో ఇప్పటికే అర డజను సినిమాలు అనౌన్స్ చేసాడు. వాటిలో ఇప్పటికే 'క్లైమాక్స్' సినిమాని 'ఆర్జీవీ వరల్డ్ - శ్రేయాస్ ఈటీ'లో రిలీజ్ చేసిన వర్మ ఇటీవల 'నగ్నం' సినిమాని ప్రేక్షకుల మీదకి వదిలారు. వీటితో పాటు 'కరోనా' 'మర్డర్' 'కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్' 'ది మ్యాన్ హూ కిల్లుడ్ గాంధీ' సినిమాలను కూడా ప్రకటించారు రాంగోపాల్ వర్మ. అంతేకాకుండా మరో కాంట్రవర్సీ టైటిల్ పెట్టి 'పవర్ స్టార్' అనే సినిమా చేయబోతున్నానంటూ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాడు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సినిమా అనౌన్స్ చేశారు.

వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన ఆర్జీవీ అదే సమయంలో ప్రజలను భయపెట్టిస్తోన్న అంశాలపై కూడా సినిమాలు తీస్తాడు. అయితే ఒకప్పుడు 'రాత్రి' 'భూత్' సినిమాలతో ఆడియన్స్ ని భయపెట్టిన వర్మ ఈ మధ్య హారర్ సినిమాలు తీయడం తగ్గించాడు. ఇప్పుడు అందరూ కరోనాతో భయపడిపోతుంటే నేను సినిమాతో భయపెడతాను అంటూ ''12 O క్లాక్'' అనే హారర్ మూవీ ప్రకటించాడు. ఈ సినిమా షార్ట్ ఫిల్మ్ కాదని 1 గంట 45 నిముషాలు ఉండే ఫుల్ లెన్త్ సినిమా అని చెప్పుకొచ్చాడు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకి 12 'O' క్లాక్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించనున్నారు.