Begin typing your search above and press return to search.

రేవతితో మహేష్ కూతురు ఆటలు

By:  Tupaki Desk   |   5 April 2016 5:34 AM GMT
రేవతితో మహేష్ కూతురు ఆటలు
X
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న బ్రహ్మోత్సవం.. మే నెలలో విడుదలకు శరవేగంగా సిద్ధమయిపోతోంది. మహేష్ గారాల చిన్నారి సితార ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ సమయంలో..సెట్‌ లో సరదాగా గడిపింది.

సీనియర్ నటి రేవతి బ్రహ్మోత్సవంలో ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. రేవతితో సితార తేలిగ్గా కలిసిపోయిందట. వీరిద్దరూ సరదాగా గడిపిన సందర్భాలను, చిన్నారికి రేవతి కబుర్లు చెబుతున్న ఒక ఫొటోను మహేష్ బాబు అభిమానులతో పంచుకున్నాడు. చిన్నారి సితార ఒక చిన్ని బ్యాగ్‌ ను భుజానికి వేసుకుని ముద్దుగా కనిపిస్తోంది. రేవతి కూడా సితారతో మాట్లాడుతోంది. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటో.. ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది.

అయితే ఈ ఫోటోకు ‘బ్రహ్మోత్సవం’ అని హ్యాష్‌టాగ్‌ను జత చేశాడు మహేష్ బాబు. అంటే.. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో సితార కూడా కనిపిస్తుందా అనుకుంటున్నారు అభిమానులు. సమంత - కాజల్‌ - ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి మిక్కీ జె మేయర్‌ - మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.