Begin typing your search above and press return to search.

ప్చ్‌.. సుడిగాలిలో.. రేష్మి ఊహలు..

By:  Tupaki Desk   |   10 Dec 2015 10:30 PM GMT
ప్చ్‌.. సుడిగాలిలో.. రేష్మి ఊహలు..
X
ఈ మధ్యన స్మాల్‌ స్ర్కీన్‌ యాక్టర్ల గురించి కూడా విపరీతమైన రూమర్లు పుట్టుకొస్తున్నాయి. మామూలుగా ఫిలిం స్టార్లయితే ఏదో ఒక శుక్రవారం తెర మీద కనిపిస్తారు.. కాని ఈ స్మాల్‌ స్ర్కీన్‌ స్టార్లు మాత్రం.. నిత్యం కనిపిస్తూనే ఉంటారు. అందుకేనేమో వీరిపై బోలెడన్ని రూమర్లు వస్తూనే ఉంటాయి. ఇదిగో ఇప్పుడు జబర్‌ దస్త్‌ పొట్టిదుస్తుల పాప రేష్మి గురించి ఇలాంటివే వచ్చాయి.

రేష్మి సాధారణంగా చాలామంది జబర్‌ దస్త్‌ పార్టిసిపెంట్లతో క్లోజ్‌ గానే ఉంటుంది. అలా ఉండటమే ఆమె జాబ్‌. అందుకే ఆ కంటెస్టెంట్లు కూడా ఆమెపై చాలా ఈజీగా జోకులు పేల్చగలుగుతున్నారు. కాకపోతే ఈ క్లోజ్‌ నెస్‌ గురంచి కొందరు ప్రచారం చేస్తూ.. యాంకర్‌ రేష్మి అండ్‌ సుడిగాలి సుధీర మధ్యన కుచ్‌ కుచ్‌ హోతా హై అంటూ హడావుడి చేస్తున్నారు. వాళ్లిద్దరూ ఆజాద్‌ సినిమాలోని సుడిగాలిలో తడిఊహలూ అంటూ పాటేసుకుంటున్నారని రూమర్లు వస్తున్న వేళలో.. అయ్యబాబోయ్‌ నేను అందరితోనూ క్లోజే.. అందుకని ఎఫైర్‌ అంటారా అంటూ రుసరుసలాడింది రేష్మి.

సర్లేండి.. ఇలా రూమర్స్‌ రావడం కూడా ఒక విధంగా ఉచిత పబ్లిసిటీనే. మన బాలీవుడ్‌ భామలను అడుగమ్మా.. రూమర్లతో చక్కగా ఎలా పబ్లిసిటీ చేయించుకొని ఛాన్సులు పట్టేస్తారో.