Begin typing your search above and press return to search.

రియాపై రిపబ్లిక్‌ టీవీ మరో సంచలన కథనం

By:  Tupaki Desk   |   23 Aug 2020 9:54 AM GMT
రియాపై రిపబ్లిక్‌ టీవీ మరో సంచలన కథనం
X
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ మరణం తర్వాత రిపబ్లిక్‌ టీవీలో బాలీవుడ్‌ పై వరుసగా కథనాలు వస్తున్నాయి. బాలీవుడ్‌ లో ఉన్న నెపొటిజం మరియు డ్రగ్స్‌ పబ్స్‌ కల్చర్‌ గురించి కొన్ని రోజుల క్రితం రిపబ్లిక్‌ టీవీలో చర్చ కార్యక్రమం కూడా నిర్వహించారు. సుశాంత్‌ మరణంకు బాలీవుడ్‌ లోని కొందరు కారణం అయ్యి ఉంటారు అంటూ మొదటి నుండి కూడా రిపబ్లిక్‌ టీవీ కథనాలు ప్రసారం చేస్తూ ఉంది. అందులో భాగంగా కొన్ని ఇన్వెస్టిగేషన్‌ వీడియోలను కూడా టెలికాస్ట్‌ చేసింది. ఈసారి రియా గురించి రిపబ్లిక్‌ టీవీలో ఆసక్తికర కథనం వచ్చింది.

సుశాంత్‌ మరణించిన తర్వాత ఆమె మీడియాలో తన గురించి పాజిటివ్‌ గా కథనాలు వచ్చేలా ప్లాన్‌ చేసింది. అందుకోసం ఒక దర్శకుడిని ఆమె సంప్రదించిందని అతడి సహా మేరకు పీఆర్‌ టీం సాయంతో తన గురించి మీడియాలో పాజిటివ్‌ గా కథనాలు వచ్చేలా ఆమె మ్యానేజ్‌ చేసింది. అందుకోసం ఆమె డబ్బు కూడా ఖర్చు చేసిందట. ముఖ్యంగా ఒక దర్శకుడితో ఈమె సన్నిహిత్యం గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఆ బంధం గురించి క్లారిటీ ఇస్తూ అది ఒక తండ్రి కూతురు బంధంగా గుర్తించాలంటూ మీడియాలో ప్రచారం అయ్యేలా వాట్సప్‌ స్క్రీన్‌ షాట్స్‌ ను ఆమె లీక్‌ చేసింది.

ఆ స్క్రీన్‌ షాట్స్‌ ప్రముఖంగా మీడియాలో ట్రెండ్‌ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఆమె పీఆర్‌ టీం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అనుకున్నట్లుగానే ఆ స్క్రీన్‌ షాట్స్‌ బాగా వైరల్‌ అయ్యాయి. వాటిని చూసిన తర్వాత ఆ దర్శకుడు రియా లు ఒక తండ్రి కూతురు మాదిరిగా ఉన్నారని అనుకున్నారు. ఈ విషయాన్ని అంతగా ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటీ అంటూ రియాను రిపబ్లిక్‌ టీవీ కథనంలో ప్రశ్నించడం జరిగింది. మొత్తానికి రియా గురించిన వార్తలతో ఆమెకు సుశాంత్‌ మృతితో దగ్గర సంబంధం ఉందా అనే అనుమానం కలుగుతున్నాయని నెటిజన్స్‌ అంటున్నారు. సీబీఐ వారు ఈ కేసును విచారణ చేస్తున్నారు. రియాను వారు ప్రశ్నిస్తే అసలు విషయాలు వచ్చే అవకాశం ఉంది.