Begin typing your search above and press return to search.

కలెక్టర్ పంజా అభిరామ్‌ రెడీ టు యాక్షన్‌

By:  Tupaki Desk   |   16 Aug 2021 6:34 AM GMT
కలెక్టర్  పంజా అభిరామ్‌ రెడీ టు యాక్షన్‌
X
మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్.. దేవ కట్టల కాంబోలో రూపొందిన రిపబ్లిక్ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. షూటింగ్ కు కరోనా పదే పదే అడ్డు వచ్చినా కూడా మొత్తానికి ముగించారు. మొన్నటి వరకు థియేటర్లు లేని కారణంగా విడుదల గురించి హడావుడి లేదు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఈ సినిమాను అక్టోబర్‌ 1న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. సినిమా విడుదల తేదీ ప్రకటించిన సమయంలోనే సినిమాకు సంబంధించిన కీలక విషయాలను వెళ్లడించారు. అందులో భాగంగా హీరో పాత్ర పేరు పంజా అభిరామ్ అని.. జిల్లా కలెక్టర్ అని కూడా రివీల్‌ చేశారు. పొలిటికల్‌ బ్యాక్ డ్రాప్ తో ఉండే ఈ సినిమా కథ విషయమై ఇప్పటి వరకు యూనిట్‌ సభ్యుల నుండి ఎలాంటి హింట్ రాలేదు. తాజా కాన్సెప్ట్ పోస్టర్ తో పొలిటికల్‌ వ్యవస్థపై పోరాటం చేసే ఐఏఎస్‌ ఆఫీసర్ పంజా అభిరామ్‌ పాత్రలో సాయి ధరమ్‌ తేజ్ కనిపించబోతున్నట్లుగా దీంతో క్లారిటీ వచ్చింది.

సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా ఇప్పటి వరకు పలు సినిమాల్లో నటించాడు. అయితే ఈ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు పలువురు హీరోలు కలెక్టర్‌ లుగా నటించారు. అయితే మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ మాత్రం జిల్లా కలెక్టర్ గా మొదటి సారి నటిస్తున్నాడు. యంగ్‌ అండ్ డైనమిక్ కలెక్టర్ పాత్రకు సాయి ధరమ్‌ తేజ్ పూర్తి న్యాయం చేశాడు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే సినిమాపై అంచనాలు పెంచే విధంగా పాట మరియు పోస్టర్ లను విడుదల చేశారు. తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. కనుక అక్టోబర్‌ 1 కు ముందు అంటే వచ్చే నెల మొత్తం కూడా రిపబ్లిక్ పబ్లిసిటీ హంగామా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పొలిటికల్‌ అండ్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉండే రిపబ్లిక్ మూవీతో దర్శకుడు దేవా కట్టా తన పూర్వ వైభవంను చాటుకుంటాడా అనేది చూడాలి. సాయి ధరమ్‌ తేజ్‌ కు కూడా బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ సక్సెస్ లు కావాలి. ఆ సక్సెస్‌ దీంతో వస్తుంది అనే నమ్మకంతో ఆయన సన్నిహితులు ఉన్నారు. దేవా కట్టాతో పాటు సాయి ధరమ్‌ తేజ్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాలా కష్టపడ్డాడు. తప్పకుండా ఈ సినిమా ఇద్దరికి మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. ఈమద్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్‌ లకు మరియు కథలకు మంచి డిమాండ్ ఉంది. కనుక ఈ సినిమా కూడా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.