Begin typing your search above and press return to search.
'అంత ద్వేషం ఎందుకన్నా..నాకిది స్పెషలే' రేణుదేశాయ్ కౌంటర్
By: Tupaki Desk | 20 April 2020 6:30 PM ISTటాలీవుడ్ ప్రముఖ నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో తన ఫస్ట్ సినిమా బద్రి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా టైంలో పవన్ కళ్యాణ్ తో పనిచేసిన అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ సినిమాతోనే రేణు దేశాయ్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. మేం మారుమూల ప్రాంతంలో షూట్ చేస్తున్నప్పుడు.. షూటింగ్ మధ్యలో కూర్చొవడానికి కనీసం కుర్చీలు కూడా లేవు. అక్కడ విపరీతంగా గాలి వీచేది. అంత గాలిలో నిల్చోవడం, డ్యాన్స్ చేయడం చాలా కష్టంగా ఉండేది. షూటింగ్ పూర్తయ్యేసరికి మేం చాలా అలసిపోయేవాళ్లం. షూటింగ్ స్పాట్‌కి చేరుకోవాలంటే ఎండలో చాలా దూరం నడవాల్సి వచ్చేది. చాలా అలసటగా, ఆకలిగా అనిపించేదని రేణు పేర్కొన్నారు.
అయితే రేణుదేశాయ్ పోస్ట్ చూసిన ఒక పవర్ స్టార్ అభిమాని ‘ఈ రేణుదేశాయ్ ఏంటో మళ్లీ కెలుకుతోంది. అవసరమా ఇప్పుడు... ఆ మధ్య చాలా ఓవర్ యాక్షన్ చేసింది. మళ్లీ ఈ పోస్ట్‌లు ఎందుకు? ఎంగేజ్ మెంట్ అయ్యింది కదా... ఆ విషయం ఏమైంది?’ అంటూ పోస్ట్ చేశాడు. అతని పోస్ట్ స్క్రీన్ షాట్ చూసిన రేణు దేశాయ్ పవన్ అభిమానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘అవసరమా... అంటే అవును అవసరం. బద్రీ వచ్చి నేటికి 20 ఏళ్లు. ఈ సినిమాను చాలామంది మరిచిపోయారు. కాని ఇది నా మొదటి సినిమా. నాకు చాలా చాలా స్పెషల్. ఇంత ద్వేషం ఎందుకు అన్నా.. మనం ఇప్పటికే ఈ కరోనా వైరస్ వల్ల చాలా కష్టాల్లో ఉన్నాం. ఇంత కోపం ఆరోగ్యానికి మంచిది కాదు. అందరికోసం కాస్త మంచిగా ఆలోచించండి’ అంటూ క్లియర్ గా తెలుగులో రాసుకొచ్చింది రేణు దేశాయ్. రేణు దేశాయ్ కి తన మొదటి సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోవడమే మంచిదంటున్నారు ఫ్యాన్స్.