Begin typing your search above and press return to search.

ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసిన రేణు...!

By:  Tupaki Desk   |   15 Sept 2020 1:20 PM IST
ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసిన రేణు...!
X
సినీ అభిమానులకు రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'బద్రి' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రేణూ దేశాయ్.. పవన్ కళ్యాణ్ తో కొన్నాళ్ళు సహజీవనం చేసి వివాహం చేసుకుంది. నటనకు దూరం అయినప్పటికీ కాస్ట్యూమ్ డిజైనర్ గా రచయితగా నిర్మాతగా దర్శకురాలిగా రేణు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. భర్తతో విడిపోయిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ 'ఇష్క్ వాలా లవ్' అనే సినిమాకి దర్శకత్వం వహించింది. అంతేకాకుండా మంచి పాత్రలు వస్తే నటించడానికి రెడీగా ఉన్నానని ప్రకటించింది. పలు బుల్లితెర షో లలో కూడా కనిపించింది. ఈ క్రమంలో రైతు సమస్యలపై ఓ సినిమా చేయడానికి సంకల్పించారు రేణు.

కాగా, రైతు సమస్యల చాలా రోజులుగా అధ్యయనం చేసిన రేణు దేశాయ్ స్వీయ దర్శకత్వంలో వారిపై ఓ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న రేణు దేశాయ్.. గతంలో ఓ న్యూస్ ఛానల్ కోసం రైతు సమస్యలపై ఓ ప్రోగ్రామ్ చేసింది. ఈ క్రమంలోనే రైతులు - వ్యవసాయంపై ఆమె పూర్తి స్థాయి సినిమా చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కాని ఏడాది గడుస్తున్నా దానిపై ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా ఉందో లేదో అని అందరూ డౌట్ పడ్డారు. అయితే తాజాగా ప్రముఖ రచయిత గోరేటి వెంకన్నను కలిసిన రేణు దేశాయ్.. అతనితో పాటలు రాయించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇన్నాళ్లు కరోనా కారణంగా సినిమాని సైలెంటుగా ఉన్న రేణు.. ఇప్పుడిప్పుడే సినిమాలు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఆమె కూడా తన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఆమెకు డైరెక్టర్ గా తెలుగు డెబ్యూ మూవీ అని చెప్పవచ్చు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.