Begin typing your search above and press return to search.

ఎమోషనల్ పోస్టుతో అకీరాకి బర్త్ డే విషెస్ చెప్పిన రేణు దేశాయ్

By:  Tupaki Desk   |   8 April 2020 11:00 AM GMT
ఎమోషనల్ పోస్టుతో అకీరాకి బర్త్ డే విషెస్ చెప్పిన రేణు దేశాయ్
X
జూనియర్ పవర్ స్టార్ అకిరా నందన్ పుట్టినరోజు సందర్భంగా మెగా హీరోలందరూ అకీరాకు బర్త్ డే విషెస్ చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం అకీరాకి ఆశీస్సులు అందించాడు. ఈ సందర్భంగా తమ్ముడు పవన్ కుమారుడు అకిరాను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేశారు. 'మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6'4") అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి.. విష్ యూ ఏ పవర్ ఫుల్ ప్యూచర్. హ్యాపీ బర్త్ డే అకిరా' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరాకు చిరు విషెస్ తెలపడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అటు పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. దీంతో బాస్ సూపర్ అంటూ మెగా ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతున్నారు.

ఇవాళ అకిరా బర్త్ డే సందర్భంగా అటు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అకీరాకు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల మొదటి సంతానం అకిరా నందన్. పవన్ కళ్యాణ్ తన రెండవ భార్య రేణుదేశాయ్ కు విడాకులిచ్చి విదేశీయురాలైన ఒక మహిళను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రేణు దేశాయ్ పుణేలో తన కొడుకు, కూతురితో నివాసముంటుంది. ఇప్పుడు అకిరా పెరిగి పెద్దవాడయ్యాడు. ఈ రోజు తన 16వ పుట్టినరోజు. ఈ సందర్భంగా తల్లి రేణుదేశాయ్ కూడా అకీరాకి బర్త్ డే విషెస్ చెప్పింది. ''నా లిటిల్ బాయ్ కి ఇప్పుడు 16 ఇయర్స్ వచ్చాయి.. మీ అమ్మ నీ వెనుక ఎప్పుడూ ఉంటుంది" అంటూ పోస్టు పెట్టింది. దీనికి అకీరా చిన్ననాటి పిక్ జత చేసి సోషల్ మీడియాలో భావోద్వేగంతో పోస్ట్ చేసింది.

రేణు దేశాయ్ తన కొడుకు 'జూనియర్ పవర్ స్టార్ ఇష్టం లేదని, తనకంటూ సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటూ పెరగాలని గతంలో చాల సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. అకిరా ఓ మరాఠీ చిత్రంలో న‌టించాడు. రేణు దేశాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ 'ఇష్క్ వాలా లవ్' సినిమాలో అకీరా న‌టించాడు. అకిరా నంద‌న్ ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇప్ప‌టినుంచే పోటీప‌డుతున్నారు.