Begin typing your search above and press return to search.

వేగంగా రేణుదేశాయ్​ వెబ్ ​సీరిస్​ షూటింగ్​.. త్వరలోనే విడుదల!

By:  Tupaki Desk   |   16 Nov 2020 1:40 PM IST
వేగంగా రేణుదేశాయ్​ వెబ్ ​సీరిస్​ షూటింగ్​.. త్వరలోనే విడుదల!
X
రేణుదేశాయ్​ ‘ఆద్య’ అనే వెబ్​సీరిస్​లో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్​ ఇండియా వెబ్​సిరిస్​గా ఇది తెరకెక్కుతున్నది. పవర్​ఫుల్​ లేడీ పాత్రలో రేణు అలరించబోతున్నదట. ఇప్పటికే మొదటి షెడ్యూల్​ షూటింగ్​ కూడా పూర్తయ్యింది. మంగళవారం నుంచి రామోజీఫిల్మ్​సిటీలో సెకండ్​ షెడ్యూల్​ షూటింగ్​ ప్రారంభం కానున్నది. ఈ వెబ్ సిరీస్ లో నందిని రాయ్, బాలీవుడ్ హీరో వైభవ్ తత్వవాడి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రేణుదేశాయ్​ ఈ నటిస్తుండటంతో ‘ఆద్య’పై జాతీయస్థాయిలో చర్చ జరుగుతున్నది. ఎంఆర్ కృష్ణ మామిడాల ఈ వెబ్​సీరిస్​ ద్వారాదర్శకుడిగా పరిచయం అవుతుండగా.. రజనీకాంత్ ఎస్, డీఎస్​ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

కృష్ణ చెప్పిన కథ బాగా నచ్చడంతో రేణు ఈ చిత్రాన్ని ఒప్పుకున్నదని టాక్​. జీవితంలో అన్ని కోల్పోయి.. నిలదొక్కుకొనే ఓ గొప్పస్త్రీమూర్తి పాత్రలో రేణు నటించబోతుందట. ఈ సిరీస్ ఎలా ఉండబోతుందో. అన్నట్లు రేణు దేశాయ్ ప్రస్తుతం ఓ సినిమాని కూడా డైరెక్ట్ చేస్తోంది. ప్రధానంగా ఈ చిత్రంలో రైతుసమస్యలను చర్చించబోతున్నట్టు టాక్​. ఈ సినిమాలో నటించేముందు రేణుదేశాయ్​ పలువురు రైతులను కలిసి వారి అనుభవాలను కలుసుకున్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖ గాయకుడు, ప్రస్తుతం సేంద్రియవ్యవసాయం చేస్తున్న గోరటి వెంకన్నను కూడా రేణుదేశాయ్​ కలుసుకున్నారు.

రైతులపడే ఇబ్బందులు.. సేంద్రియసాగులో ఎదురయ్యే ఒడిదొడుకులు తదితర సమస్యలు ఈ వెబ్​సీరిస్​లో ప్రధానంగా తెరకెక్కుతున్నట్టు సమాచారం. అయితే వెబ్​సీరిస్​ అంటేనే బోల్డ్​ కంటెంట్​ ఉన్న చిత్రాలు అనే దోరణి ప్రేక్షకుల్లో ఉన్నది. అందుకు తగ్గట్టే దర్శకులు కూడా యువతను దృష్టిలో ఉంచుకొనే ఇటువంటి సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయం నేపథ్యంలో ఓ వెబ్​సీరిస్​ తెరకెక్కడం నిజంగా సాహసమే.