Begin typing your search above and press return to search.

దేవాల‌యాల‌పై రేణు దేశాయ్ వేడెక్కించే కామెంట్

By:  Tupaki Desk   |   18 March 2021 9:00 PM IST
దేవాల‌యాల‌పై రేణు దేశాయ్ వేడెక్కించే కామెంట్
X
సినిమాల‌కు దూర‌మైనా బుల్లితెర కార్య‌క్ర‌మాల‌తో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటున్నారు రేణు దేశాయ్. రియాలిటీ షోల‌కు జ‌డ్జీగా వ్య‌వ‌హ‌రిస్తూనే.. ప‌లు సామాజికాంశాల‌పై సోష‌ల్ మీడియాల్లో చ‌ర్చిస్తూ నిరంత‌రం అభిమానుల‌కు ట‌చ్ లో ఉన్నారు.
తాజాగా రేణు దేశాయ్ కాశీ యాత్ర హాట్ టాపిక్ గా మారింది. గంగాన‌దిలో పుణ్య స్నాన‌మాచ‌రిస్తే క‌లిగే ప్ర‌యోజ‌నాలే కాదు.. ర‌క‌ర‌కాల విష‌యాల్ని రేణు తాజా చాటింగులో ప్ర‌స్థావించారు.అంతేకాదు దేవాల‌యాల‌పై రేణు కామెంట్లు వైర‌ల్ గా మారాయి.

నిజానికి మ‌సీదులు.. చ‌ర్చిలు ప్ర‌యివేట్ వ్య‌క్తుల చేతిలో ఉంటే ఒక్క దేవాలయాలు మాత్ర‌మే ప్ర‌భుత్వాధీనంలో ఉంటాయి.. ఎందుక‌ని? అంటూ లాజిక‌ల్ క్వశ్చ‌న్ చేసిన రేణు హాట్ టాపిక్ గా మారింది. ఇది యూట్యూబ్ చానెల్ ఇంట‌ర్వ్యూ అయినా రేణు చాటింగ్ కి సంబంధించిన‌ ప్ర‌మో హాట్ టాపిక్ గా మారింది. గుడుల్ని ప్ర‌భుత్వాలు చేతిలో పెట్టుకుంటే లౌకిక దేశం అవుతుందా? అంటూ లాజిక్ వెత‌క‌డంతో అంతా నోరెళ్ల‌బెడుతున్నారు. నిజ‌మే క‌దా.. ఈ లాజిక్ ఎవ‌రి బుర్ర‌ల‌కు తోచ‌లేదేమిటి ఇన్నాళ్లు! అంటూ అభిమానులు వ్యాఖ్య‌ల్ని జోడిస్తున్నారు.