Begin typing your search above and press return to search.
గోరేటి వారి ఇంట రేణు దేశాయ్ వింధు
By: Tupaki Desk | 14 Sept 2020 11:03 PM ISTమాజీ హీరోయిన్ రేణు దేశాయ్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక వైపు ఆమె నటిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూనే మరో వైపు సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రేణు దేశాయ్ ఒక సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు తెలుగు సినిమాను తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నారు. తెలుగులో రైతుల సమస్యలపై రేణు దేశాయ్ సినిమా తీస్తున్నట్లుగా కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. ఇప్పుడు ఆ సినిమా పనిపై ఆమె ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల గోరేటి వెంకన్న ఫామ్ హౌస్‌లో ఆయన్ను కలిసింది. ఆయనతో తన సినిమాలకు పాటలు రాయించడం చాలా గర్వంగా ఉందంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.
గోరేటి వెంకన్న ఫామ్ హౌస్ లో రేణు దేశాయ్ కుండలో వండిన భోజనంను అరటి ఆకులో చేయడంతో పాటు చాలా అహ్లాదరకమైన వాతావరణంలో గడిపినట్లుగా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన వీడియోలు మరియు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఆమె సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతుంది. రైతుల సమస్యలపై ఆమె గతంలో ఒక కార్యక్రమం చేసింది. ఆ అనుభవం మరియు ఇతరత్ర కారణా వల్ల సినిమాను చేసేందుకు ఆమె రెడీ అయినట్లుగా తెలుస్తోంది. రైతుల సమస్యపై సినిమా తీస్తే కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని చవి చూస్తుంది అనేది చూడాలి.