Begin typing your search above and press return to search.
స్టుపిడ్ రాతలంటూ రేణూ ట్వీట్
By: Tupaki Desk | 26 Oct 2015 9:00 PM ISTట్విట్టర్ లో పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ యాక్టివ్ గా ఉంటుంది. డైలీ అప్డేట్స్ ని ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారామె. ఉదయాన్నే గుడికి వెళ్లిన రేణూ దేశాయ్.. ఆ గెటప్ తోనే ఓ ఫోటో ట్వీట్ చేసింది. తానేం అపర భక్తురాలిని కాకపోయినా.. ఉదయాన్నే ఇలా గుడికొస్తే మనసు ప్రశాంతంగా ఉంటుదని ట్వీట్ చేసింది రేణూ.
అయితే రేణూ చేసిన ఫోటో ట్వీట్ ఆధారం చేసుకుని.. ఓ వెబ్ సైట్ గాసిప్ న్యూస్ పబ్లిష్ చేసింది. తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ - తాను నిర్మిస్తున్న మరాఠీ మూవీ ఇష్క్ వాలా లవ్ బాగా ఆడాలని కోరుకునేందుకే రేణూ భక్తురాలి అవతారమెత్తింది అన్నది ఆ వార్త సారాంశం.
దీన్ని గమనించిన రేణూ దేశాయ్ ట్వీట్ తో రిటార్ట్ ఇచ్చింది. ఇలాంటి స్టుపిడ్ ఆర్టికల్ రాసినవారు ఎవరో కానీ.. అతనికి మైండ్ లేదని, ఈవ్యక్తి పని పాటా ఏమీ లేదంటూ మరో ట్వీట్ పెట్టింది. ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాస్తే రేణు ఎలా రియాక్ట్ అవుతుందనే విషయం జనాలకు బాగానే అర్ధమైంది. గట్టి రిటార్ట్ ఇచ్చిన రేణూ దేశాయ్ కి ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ బాగా లభించింది.