Begin typing your search above and press return to search.

ఖుషి-2: పవన్ హీరో.. రేణు నిర్మాత

By:  Tupaki Desk   |   7 Jan 2016 7:32 PM IST
ఖుషి-2: పవన్ హీరో.. రేణు నిర్మాత
X
నిప్పు లేనిదే పొగరాదని అంటారు కదా. మరి రేణు దేశాయ్, ఎస్.జె.సూర్య కలిసి ఫొటో దిగడంలో ఆంతర్యమేంటబ్బా అని జనాలు బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు. తీరా ఏంటి సంగతా అని ఆరా తీస్తే.. ఖుషి-2 తెరమీదికి వస్తోందని తెలిసింది. సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, రేణు దేశాయ్ నిర్మాణంలో ఖుషి-2 పట్టాలెక్కే అవకాశాలు మెండుగానే ఉన్నట్లు పవన్ కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం.

పుష్కరం కిందట ‘ఖుషి’ సినిమాతో తెలుగు యువ హృదయాల్ని కొల్లగొట్టాడు సూర్య. ఆ తర్వాత పవన్ తో అతను తీసిన ‘పులి’ పెద్ద డిజాస్టర్ అయింది. అయినప్పటికీ సూర్యను మళ్లీ పవన్ తన కాంపౌండ్లోకి రానిచ్చాడంటే విశేషమే. ఈ మధ్యే పవన్ ను సూర్య కలిసి ఓ కథ వినిపించాడంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మరి పవన్ ఏమన్నాడో కానీ.. తాజాగా రేణు దేశాయ్ తో కలిసి ఓ ఫొటోలో కనిపించి ఆశ్చర్యపరిచాడు సూర్య.

పవన్ ను కలిశాక సూర్య రేణును కూడా మీట్ అయ్యి ఖుషి-2 కథ చెప్పి మెప్పించాడట. ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందట రేణు. తన మాజీ భార్య నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ తనతో సత్సంబంధాలే మెయింటైన్ చేస్తున్నాడు పవన్. నిజంగా పవన్.. రేణు నిర్మాణంలో సూర్య దర్శకుడిగా ఖుషి-2 చేస్తే అంతకంటే సెన్సేషన్ మరొకటి ఉండదు.