Begin typing your search above and press return to search.

పవన్ కే ఇష్టం లేదంటున్న రేణు

By:  Tupaki Desk   |   8 July 2018 11:32 AM IST
పవన్ కే ఇష్టం లేదంటున్న రేణు
X
రెండో పెళ్లి చేసుకున్నాక కొద్ధి రోజులు సైలెంట్ గా ఉన్న రేణు దేశాయ్ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాటలు చెప్పేసుకుంది. ఇందులో పవన్ కళ్యాణ్ వారసుడిగా అభిమానులు చూసుకుంటున్న అకీరా నందన్ ప్రస్తావన కూడా ఉంది. తన కొడుకుని జూనియర్ పవర్ స్టార్ అని పిలవడం ముందు నుంచి తనకు ఇష్టం లేదని చెబుతూనే వచ్చిన రేణు దేశాయ్ ఇదే విషయం పవన్ కళ్యాణ్ ని అడిగినా క్లారిటీ వస్తుందని అలా పిలవడం తనకూ కూడా ఇష్టం లేదనే విషయాన్ని చెప్పేసింది. పవన్ అభిమానులు ఇది తెలుసుకుంటే మంచిదని ఇంకా అనుమానం ఉంటే ఇలా చేయటం తనకూ నచ్చదనే నిజం బయటపడుతుందని తేల్చేసింది. ఇది కొందరికి చేదుగా అనిపించినా ఒప్పుకోక తప్పదని ఉద్ఘాటించడం విశేషం.

అకీరా నందన్ ను సినిమాల్లోకి తీసుకోవడం పట్ల రేణు దేశాయ్ కు వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నా పవన్ ఫాన్స్ మాత్రం తనను మామూలు హీరోగా చూడరు కాక చూడరు. దానికి మరో కారణం కూడా లేకపోలేదు. ఇప్పుడు మూడో భార్య అన్నా ద్వారా కలిగిన మగ సంతానం హీరో కావడానికి పాతికేళ్ళు పైగా పడుతుంది. అంటే ఇప్పుడు పవన్ ని ఆరాధిస్తున్న యువతరం - మధ్యవయసు బ్యాచ్ అంతా చివరి అంకంలో ఉంటుంది. సో అకీరాలోనే ఫ్యూచర్ పవన్ ని చూసుకోవాలని వాళ్ళ కోరిక. అందుకే రేణు దేశాయ్ పదే పదే అకీరాను జూనియర్ పవర్ స్టార్ అని పిలవకండి అని చెబుతోంది. కానీ ఇదంతా అంత సులువుగా తేలే వ్యవహారంలా కనిపించడం లేదు. అకీరా తెలుగు సినిమాతో లాంచ్ అయితేనే ఈ ఇబ్బంది. అలా కాకుండా వేరే బాషలో అయితే ఇంత గొడవ ఉండదు. చూడాలి కాలం ఈ కథను ఎలా మలుపు తిప్పుతుందో.