Begin typing your search above and press return to search.

పవన్ పిల్లలు ప్రస్తుతం ఎక్కడున్నారు?

By:  Tupaki Desk   |   3 Jan 2019 2:42 PM IST
పవన్ పిల్లలు ప్రస్తుతం ఎక్కడున్నారు?
X
పవన్ కళ్యాణ్ తో డైవోర్స్ తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ పూణేలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఇద్దరు పిల్లలు అకీరా నందన్.. ఆద్య రేణు దేశాయి తోనే ఉంటున్నారు. వీలు చిక్కినప్పుడు పవన్ పూణే కు వెళ్లి పిల్లలను కలవడం.. లేదా పిల్లలే పవన్ దగ్గరకు రావడం తండ్రితో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం జరిగేది. కొన్ని నెలల క్రితం ఐ సర్జరీ తర్వాత పవన్ విజయవాడలో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అకీరా పూణే నుంచి నాన్న కోసం వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ తన వైఫ్ అన్నా లెజ్నేవా.. పిల్లలు పోలేనా.. మార్క్ శంకర్ లతో యూరోప్ టూర్ లో ఉన్నాడు.. క్రిస్మస్ తో పాటుగా న్యూ ఇయర్ వెకేషన్ ను పవన్ ఇలా ప్లాన్ చేశాడట. ఈ ట్రిప్ లో అకీరా.. ఆద్యలు కూడా జాయిన్ అయ్యారని సమాచారం. ఈ విషయాన్ని రీసెంట్ గా రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది. ఇద్దరు పిల్లలు వాళ్ళ నాన్నతో యూరోప్ లో ట్రిప్ లో ఉన్నారని కన్ఫాం చేసింది.

అకీరా.. అద్యలు ఇద్దరూ అన్నా లెజ్నేవా.. పోలేనా.. మార్క్ శంకర్ తో చక్కగా కలిసిపోయి ఫుల్ గా వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారట. ఏదేమైనా జనసేనాని రొటీన్ రాజకీయాలు.. విమర్శలు.. ప్రతి విమర్శలు ఈ హంగామా అంతా పక్కనబెట్టి తన కుటుంబానికి కూడా కొంత సమయం కేటాయించడం మంచిదే కదా.