Begin typing your search above and press return to search.
మహేష్ కి వదినగా రేణూ దేశాయ్..?
By: Tupaki Desk | 5 Jan 2021 12:17 PM ISTప్రముఖ నటి రేణూదేశాయ్ 'ఆద్య' అనే లేడీ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ తో సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నటిగా రీ ఎంట్రీ ఇవ్వడంతో రేణూకి వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' లో రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో నటించనుందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో రేణూ మహేష్ బాబుకి వదినగా నటిస్తున్నారని అంటున్నారు.
పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్న 'సర్కారు వారి పాట' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి నిర్మించనున్నాయి. బ్యాంక్ స్కామ్ ల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటించనుంది. ఇక ఈ సినిమాలో మహేష్ కి వదిన క్యారక్టర్ కోసం రేణూదేశాయ్ తో చిత్ర యూనిట్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మరి దీనికి రేణూ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.
రేణూదేశాయ్ మహేష్ సినిమాలో నటించనున్నారనే వార్తలు రావడంతో మెగా ఫ్యాన్స్ ఠో పాటు మహేశ్ అభిమానులు కూడా దీనికి సంబంధించి వివరాల కోసం ఆసక్తి కనబరుస్తున్నారు. వాస్తవానికి ఆ మధ్య ఇన్స్టా చిట్ చాట్ లో రేణూని 'మహేష్ - ప్రభాస్ వంటి హీరోలకు తల్లిగా నటించే అవకాశం వస్తే చేస్తారా?' అని అడుగగా ఆమె చాలా కూల్ గా సమాధానమిచ్చింది. 'హీరోల చిన్నతనంలోని పాత్రలకు తల్లి పాత్ర చేయడానికి సిద్ధమేనని.. తనను అలాంటి లుక్ లో చూపింగలరనే నమ్మకం దర్శకులకు ఉంటే మాత్రం తాను మహేష్ లాంటి హీరోలకు తల్లిగా నటిచేందుకు సిద్ధమేనని' రేణూ దేశాయ్ తెలిపింది.