Begin typing your search above and press return to search.

`స‌ర్కార్ వారి పాట`‌లో రేణు దేశాయ్ పాత్ర ఇదే..!

By:  Tupaki Desk   |   4 Jan 2021 12:00 PM IST
`స‌ర్కార్ వారి పాట`‌లో రేణు దేశాయ్ పాత్ర ఇదే..!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కార్ వారి పాట`‌. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రి మూవీ మేక‌ర్స్ -14రీల్స్ ప్ల‌స్- జీఎంబీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థ‌మ‌న్ బాణీలు అందిస్తున్నారు. హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్లో సినిమా చిత్రీక‌ర‌ణ సాగుతోంద‌ని స‌మాచారం.

ఇక ఈ చిత్రంలో రేణుదేశాయ్ ఓ కీల‌క పాత్ర పోషించ‌నున్నార‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. అది ఏ త‌ర‌హా పాత్ర అయ్యి ఉంటుంది? అన్న‌ది ప‌వ‌న్ ఫ్యాన్స్ స‌హా రేణు అభిమానుల్లో ఆస‌క్తిని పెంచింది. ఇందులో మ‌హేష్ కి వ‌దిన‌మ్మ పాత్ర‌లో రేణు దేశాయ్ న‌టిస్తారన్న‌ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ త‌ర‌హా అరుదైన‌ పాత్ర‌లో అవ‌కాశం రాగానే రేణు కూడా ఎగ్జ‌యిట్ అయ్యార‌న్న టాక్ వినిపిస్తోంది.

ఇక‌పోతే ఈ చిత్రం ఆద్యంతం బ్యాంక్ కుంభ‌కోణాల నేప‌థ్యం ర‌క్తి క‌ట్టించ‌నుందని.. మ‌హేష్ బ్యాంక్ అధికారి కుమారుడి‌గా న‌టిస్తార‌ని కూడా తెలుస్తోంది. వేల కోట్ల‌ కుంభ‌కోణానికి పాల్ప‌డిన కింగ్ ఫిష‌ర్ మాల్యా లాంటి ఒక బ‌డా బిజినెస్ మేన్ నుంచి డ‌బ్బు పిండేవాడిగా మ‌హేష్ లోని మాస్ యాంగిల్ స్పెష‌ల్ గా ఆక‌ట్టుకుంటుంద‌ని చెబుతున్నారు. అలాగే ఇందులో మ‌హేష్ పాత్ర‌లో డ్యూయ‌ల్ షేడ్ .. విభిన్న‌మైన గెట‌ప్పులు.. అందులోనే ల‌వ్ స్టోరీ కూడా ర‌క్తి క‌ట్టిస్తాయ‌న్న స‌మాచారం ఉంది.