Begin typing your search above and press return to search.

అలా ఉన్నా.. ఢీ అన్న రేణు దేశాయ్

By:  Tupaki Desk   |   15 Sept 2019 12:40 PM IST
అలా ఉన్నా.. ఢీ అన్న రేణు దేశాయ్
X
రేణు దేశాయ్ నటనకు.. సినిమాలకు దూరంగా ఉన్నారేమో కానీ టీవీ కార్యక్రమాల్లో మాత్రం కనిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం రేణు ఈటీవీ లో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ ఢీ ఛాంపియన్స్ లో కొన్ని ఎపిసోడ్లకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రేణు ఢీ కార్యక్రమం షూటింగ్ కు హాజరయ్యరట. దీని గురించి వెల్లడిస్తూ రేణు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక పోస్ట్ పెట్టారు.

తన ఫోటో ఒకటి ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన రేణు "డెంగీ జ్వరం నుంచి రికవర్ అవుతున్న సమయంలో షూట్ లో పాల్గొంటే నేను ఇలా బాధగా కనిపిస్తాను( కొద్ది గంటల షూట్ కావడంతో ఢీ ఛాంపియన్స్ కు నో చెప్పలేక పోయాను). అయితే మీరందరూ దోమలతో జాగ్రత్తగా ఉండండి. మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. దోమలను పారద్రోలేందుకు రిపెల్లెంట్ క్రీమ్స్ వాడండి. లాంగ్ స్లీవ్స్ ఉండే దుస్తులు.. ప్యాంట్ లు ధరించండి. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి"అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

డెంగీ జ్వరం నుండి కోలుకుంటున్న సమయంలో ఇలా షూట్ లో పాల్గొనడం గొప్పవిషయమే కదా. ఆ ఫోటోలో రేణు తను బాధగా కనిపిస్తాను అన్నారు కానీ అదేమీ లేదు.. రికవర్ అవుతున్నా ఫేస్ లో అది తెలియనివ్వకుండా ఎంతో కాన్ఫిడెంట్ గా స్మైల్ ఇస్తూ పోజిచ్చారు. ఇక రేణు గారు చెప్పింది అందరూ నిజంగానే ఫాలో అవ్వాలి. అసలే జెట్లకు ఆలౌట్లకు టార్టాయిస్ లకు అదరని బెదరని '2.0' దోమలు.. అందుకని అందరం జాగ్రత్తగా ఉందాం.