Begin typing your search above and press return to search.
అప్పటి నుంచి రేణుకు మళ్లీ పెళ్లి ఆలోచనలు!
By: Tupaki Desk | 1 Oct 2017 3:05 PM ISTతెలుగోళ్లకు అస్సలు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.. రేణు దేశాయ్. ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ సతీమణిగా సుపరిచితమైన ఆమె.. త్వరలో ఒక టీవీ షో చేయనున్న సంగతి తెలిసిందే. పవన్ మాజీ భార్యగా ఇప్పటికి ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. పవన్ తో పెళ్లి తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయని ఆమె.. మరాఠీలో సినిమాలు చేశారు. తాజాగా ఓ డ్యాన్స్ షో ద్వారా బుల్లితెరకు పరిచయం కావటంతో పాటు.. తెలుగువారి లోగిళ్లలోకి వచ్చేశారు. తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రేణుదేశాయ్ తో బంధం తెగిని తర్వాత పవన్ మళ్లీ పెళ్లి చేసుకోవటం తెలిసిందే. అయితే.. రేణు మాత్రం పిల్లలతో కలిసి ఒంటరిగానే ఉంటున్నారు. మళ్లీ పెళ్లి అన్న మాటకు ఆమె నోట నో అంటే నో అనే మాట వినిపించేది. అయితే.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా మళ్లీ పెళ్లి చేసుకుంటే హెల్ప్ అవుతుందేమోనన్న మాట ఆమె నోటి నుంచి రావటం గమనార్హం.
ఈ మధ్యన తన ఒంట్లో బాగోని టైంలో తనను.. తన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటానికి మనవాళ్లు ఎవరైనా ఉంటే బాగుండనిపించిందని.. తన ఆరోగ్యం బాగోలేని టైంలో తన అక్క ఉదయం 3 గంటల టైంలో వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లిందని.. అలాంటి టైంలో మనవాళ్లు అనేవాళ్లు ఇంట్లో ఉంటే బాగుండేది కదా అనిపించిందన్నారు.
అలా జరిగిన తర్వాత నో మ్యారేజ్.. నో లవ్.. నో రిలేషన్ షిప్.. నో మోర్ అనుకున్నా కానీ.. ఒంట్లో బాగా లేనప్పటి నుంచి మాత్రం ఆలోచనలు మారుతున్నాయని చెప్పింది.
ఎమో ఎవరికి తెలుసు.. ఏం జరుగుతుందో? ఏం రాసి ఉంటే అది జరుగుతుంది.. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు కదా? దేవుడు ఎవరినైనా పంపిస్తే చూద్దామని రేణు చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉంటే.. పవన్ తో విడాకుల సమయంలో ఆయన దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బు.. ఆస్తుల్ని తీసుకుందన్న మాట ఉంది. అయితే.. విడాకులు తీసుకునే సమయంలో పవన్ నుంచి తానేం తీసుకోలేదని చెప్పటం విశేషం. తాను మోడలింగ్.. సినిమాల్లో నటించటం ద్వారా సంపాదించానని.. ఆ మొత్తాన్ని చాలా వాటిల్లో పెట్టుబడి పెట్టినట్లుగా ఆమె చెప్పారు. తనకు.. తన పిల్లల్ని చూసుకోవటానికి తన దగ్గర తగినంత ఆస్తిపాస్తులు ఉన్నట్లుగా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రేణు చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.