Begin typing your search above and press return to search.

రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఫిక్సా ?

By:  Tupaki Desk   |   13 July 2019 1:35 PM IST
రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఫిక్సా ?
X
పవన్ కళ్యాణ్ లైఫ్ పార్టనర్ గా గుర్తింపుతో పాటు టాలీవుడ్ లో చేసిన రెండు సినిమాలు బద్రి-జానీలోనూ అతనితోనే హీరోయిన్ గా చేసిన రేణు దేశాయ్ ఆ తర్వాత విడాకులు తీసుకుని విడిగా వ్యక్తిగత జీవితం సాగిస్తూ త్వరలో రెండో వివాహం వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తనకూ కొందరు పవన్ ఫ్యాన్స్ కు వెర్బల్ వార్ జరగడం అందరికి గుర్తే. ఇంటర్వ్యూల ద్వారా రియాలిటీ షోల ద్వారా ఈ మధ్య తెలుగు వాళ్లకు టచ్ లోకి వస్తున్న రేణు దేశాయ్ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ కూడా ఉండబోతున్నట్టుగా ఫిలిం నగర్ టాక్.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా స్టూవర్టుపురం ప్రాంతంలో పేరుమోసిన గజదొంగగా పాపులర్ అయిన టైగర్ నాగేశ్వర్ రావు బయోపిక్ కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. దొంగాట ఫేమ్ వంశి కృష్ణ దర్శకుడు. సాయి మాధవ్ బుర్ర సంభాషణలు అందిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం రేణు దేశాయ్ ని సంప్రదించబోతున్నట్టు ఓ ముఖాముఖీలో ఈ యూనిట్ వెల్లడించడం విశేషం. అయితే ఒప్పుకుంటారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

దర్శకురాలిగా తన స్వంత భాషలో ఇప్పటికే డెబ్యూ చేసిన రేణు దేశాయ్ ఇన్నేళ్ల తర్వాత కెమెరా ముందుకు మేకప్ వేసుకుని వస్తారా అనేది ఆసక్తికరం. ఇద్దరు పిల్లల మీద ఫోకస్ తో ఇన్నాళ్లు సినిమా ప్రపంచానికి కాస్త దూరంగా ఉన్న రేణు దేశాయ్ రీ ఎంట్రీ నిర్ణయం తీసుకుంటే మంచిదే. అసలే ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల కరువుంది. విజయశాంతి తర్వాత రేణు దేశాయ్ లాంటి వాళ్ళు భారీ గ్యాప్ తో ఇలా తెరమీదకు వచ్చే ప్రయత్నం చేయడం ఆయా సినిమాలకు వెయిట్ ఇచ్చేదే