Begin typing your search above and press return to search.

పింక్ రిమేక్ పై రేణు దేశాయ్ హాట్ కామెంట్

By:  Tupaki Desk   |   16 Feb 2020 5:09 PM IST
పింక్ రిమేక్ పై రేణు దేశాయ్ హాట్ కామెంట్
X
రాజకీయాల్లో ఘోర ఓటముల తర్వాత మనసు మార్చుకొని మళ్లీ సినిమాల బాట పట్టారు జనసేనాని, స్టార్ హీరో పవన్ కళ్యాణ్. ఆయన రీఎంట్రీపై పవన్ మాజీ రేణు దేశాయ్ స్పందించారు. సోషల్ మీడియాలో ఓ అభిమాని పవన్ రీఎంట్రీ మూవీలో రేణు దేశాయ్ నటిస్తున్నట్టు వస్తున్న వార్తలపై ప్రశ్నించారు.

పింక్ రిమేక్ మూవీ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాన్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనతోపాటు ముగ్గురు హీరోయిన్ల పాత్రలు కీలకం అని తెలిసింది. ఆ ముగ్గురిలో ఒకరి పాత్రకు ప్రగ్యా జైశ్వాల్ మరో పాత్రలో తాప్సిని తీసుకున్నట్టు తెలిసింది. మూడో హీరోయిన్ గా రేణు దేశాయ్ నటిస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ‘పింక్ రిమేక్ లో మీరు నటిస్తున్నారా’ అని అడిగారు. దానికి రేణు స్పందించారు.. ‘లేదండి అది ఫాల్స్ న్యూస్’ అంటూ క్లారిటీ ఇచ్చారు.

దీంతో మళ్లీ పవన్-రేణు కలిసి సినిమా చేయబోతున్నారనే అభిమానుల ఆశలకు చెక్ పెడుతూ రేణు దేశాయ్ నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది.