Begin typing your search above and press return to search.

రేణు మొబైల్ లో పవన్ ఫోటో..

By:  Tupaki Desk   |   18 Nov 2017 11:15 AM IST
రేణు మొబైల్ లో పవన్ ఫోటో..
X

చేయి చేయి కలిపి చేయూతనిద్దాం అనే కాన్సెప్ట్ తో ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ. పలువురు చిన్నారులను చేరదీసి.. వారికి అండగా నిలబడ్డమే కాకుండా.. చదువులు చెప్పించి ఉన్నత విద్యావంతులుగా మార్చేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాగే వీరిలో ఉత్సాహం నింపేందుకు పలువురు సెలబ్రిటీలను కూడా ఆహ్వానిస్తుంటారు.

రీసెంట్ గా పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్.. ఈ సంస్థ నిర్వహిస్తున్న ఓ గృహానికి వెళ్లింది. అక్కడి నుంచి నేరుగా జనాలకు లైవ్ టెలికాస్ట్ చేయడం విశేషం. అందరినీ పేరు పేరునా పరిచయం చేయడం.. వారితో సందడి చేయడం.. ఇకపై టీవీ తక్కువగా చూడాలని.. సినిమాలు తక్కువగా చూడాలని.. ఎక్కువగా చదువుకోవాలని చెప్పడమే కాదు.. వారి దగ్గర నుంచి మాట కూడా తీసుకుంది. అక్కడ ఉన్న ప్రతీ ఒక చిన్నారి కవర్ అయ్యేలా.. తన ఫోన్ నుంచి వీడియో లైవ్ ను టెలికాస్ట్ చేసింది రేణూ దేశాయ్.

అయితే.. ఇది సోషల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ కావడంతో.. అనేక మంది తమ కామెంట్స్ తో అలరించారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఫోటో కనిపించగానే.. అక్కడి చిన్నారులు అంతా తెగ సందడి చేసేశారు. నిజంగానే పవన్ కామెంట్ చేశాడని అనుకున్నారు. కానీ హీరో హీరోయిన్స్ అంటే అభిమానం ఉన్నవారు.. వారి ఫోటోలను ప్రొఫైల్ పిక్స్ గా పెట్టుకుంటారని.. అంతే తప్ప వారే అనుకోకూడదంటూ.. వారికి రేణూ దేశాయ్ వివరంగా చెప్పిన తీరు సూపర్బ్ గా ఉంది.