Begin typing your search above and press return to search.

పవన్ మాజీ వైఫ్ సన్నబడుతోందా?

By:  Tupaki Desk   |   1 July 2017 11:27 AM IST
పవన్ మాజీ వైఫ్ సన్నబడుతోందా?
X
హీరోయిన్ గా జనాలకు పరిచయమైన రేణూ దేశాయ్.. ఆ తర్వాత పవన్ భార్యగా ఇంకా ఎక్కువ ఇమేజ్ సంపాదించేసింది. పవన్ తో విడాకుల వ్యవహారం కారణంగా.. విపరీతంగా జనాల్లో రేణు పేరు నానగా.. ఇప్పటికీ సోషల్ మీడియాలో జనాలతో టచ్ లోనే ఉండడం ఈమెకు బాగా అలవాటు.

మళ్లీ పవర్ స్టార్ కు దగ్గరవుతోందంటూ.. ఈ మధ్యన ఓ గాసిప్ రాగా.. తను ఎప్పటికీ పవన్ కి మాజీ భార్యనే అంటూ రీసెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చిన రేణూ దేశాయ్.. ప్రస్తుతం లండన్ లో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా ద్వారా తన పిల్లలతో పాటు తనకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఇచ్చే రేణూ దేశాయ్.. లండన్ లోని డాల్ఫిన్ స్క్వేర్ ప్రాంతం నుంచి పోస్ట్ చేసిన ఓ పిక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హీరోయిన్ నుంచి భార్యగా మారి.. ఆ తర్వాత అమ్మగా అప్ గ్రేడ్ అయ్యాక.. హీరోయిన్ నాటి అందాలపై దృష్టిపెట్టనట్లుగా ఎప్పుడూ కనిపించని రేణూ దేశాయ్.. ఇప్పుడు కాసింత కొత్తగా కనిపిస్తోంది.

బ్లూ కలర్ టీ షర్ట్ లో పక్కకు తిరిగి ఇచ్చిన ఈ పోజులో.. రేణూ దేశాయ్ కొంచెం చిక్కినట్లుగా కనిపిస్తోందని ఫాలోయర్స్ అంటున్నారు. నటనపై మళ్లీ దృష్టి పెట్టేందుకు కాకపోయినా.. హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అవడంతోనే.. సన్నబడేందుకు రేణూ దేశాయ్ ప్రయత్నిస్తోందని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/