Begin typing your search above and press return to search.

క‌ల్యాణ్ గారికి వ్య‌తిరేకంగా మాట్లాడ‌ను:రేణు

By:  Tupaki Desk   |   5 July 2018 10:36 PM IST
క‌ల్యాణ్ గారికి వ్య‌తిరేకంగా మాట్లాడ‌ను:రేణు
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్ళి చేసుకోబోతోన్న సంగ‌తి తెలిసిందే. ఆమె ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన‌ప్ప‌టి నుంచి ట్విట్ట‌ర్ లో ప‌వ‌న్ ఫ్యాన్స్ - నెటిజ‌న్లు ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు. వారి టార్చ‌ర్ త‌ట్టుకోలేక ట్విట్ట‌ర్ ను వ‌దిలేశారు. అయితే, త‌న ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో కూడా త‌న‌ను ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వ‌డం లేదంటూ రేణు తాజాగా త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కించ‌ప‌రుస్తూ సోష‌ల్ మీడియ‌లో స‌ర్క్యులేట్ అవుతోన్న ఓ ఫొటోపై రేణు స్పందించాల‌ని కొంద‌రు కోరుతున్నార‌ని, గ‌త ఐదేళ్లుగా త‌న‌పై ట్రోలింగ్ జ‌రుగుతున్న స‌మయంలో వీరంతా త‌న‌ను సైలెంట్ గా ఉండ‌మ‌ని స‌ల‌హా ఇచ్చార‌ని రేణు ఘాటుగా స్పందించారు. త‌న‌కో న్యాయం...ప‌వ‌న్ కో న్యాయ‌మా అంటూ రేణు ఆ పోస్ట్ పెట్టిన వారిని ఉద్దేశించి ప్ర‌శ్నించారు. త‌న ఇన్ స్టా గ్రామ్ ఇన్ బాక్స్ లో పెట్టిన ఫొటోల‌ను త‌న ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం రేణు పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ప‌వ‌న్ ను కించ‌ప‌రుస్తున్న ఒక ఫొటోలోని నిరాధార విష‌యాల‌ను రేణు ఖండించాల‌ని - ఆ ఫొటో స‌ర్క్యులేట్ చేస్తోన్న వారిపై కేసు పెట్టాల‌ని కొంద‌రు నెటిజ‌న్లు రేణు ఇన్ స్టా గ్రామ్ ఇన్ బాక్స్ లో మెసేజ్ పెట్టారు. దానికి రేణు ఘాటుగా స్పందించారు. ``గ‌త ఐదేళ్లుగా త‌న‌ను కొంద‌రు ఇలాగే ట్రోల్ చేస్తున్నపుడు న‌న్ను సైలెంట్ గా ఉండాల‌ని స‌ల‌హా ఇచ్చిన వారే...ఇపుడు స్పందించాల‌ని కోరుతున్నారు. తాను ప‌బ్లిసిటీ కోసం పోస్టులు పెడుతున్నాన‌ని కొంద‌రు దూషించారు. ఇపుడు ఓ చెత్త రాజ‌కీయ నాయ‌కుడు....క‌ల్యాణ్ గారిని కించ‌ప‌రుస్తూ ఫొటో పెట్టాడ‌ని,...దానిని తాను ఖండించాలని చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. ఆ ఫొటోలో చెప్పిన విష‌యాలు అవాస్త‌వాల‌ని నేను చెప్పాల‌ని, క‌ల్యాణ్ గారికి మ‌ద్ద‌తుగా నిలిచి స్పందించాల‌ని కోరుతున్నారు. క‌ల్యాణ్ గారికి వ‌ర్తించిన రూల్స్ నాకు వ‌ర్తించ‌వా? నా త‌ప్పు లేకుండానే ఐదేళ్ల‌పాటు న‌న్ను వ్య‌క్తిగ‌తంగా దూషించారు. ఇపుడు క‌ల్యాణ్ గారికి చెడ్డ‌పేరు వ‌చ్చేలా ఒక పోస్ట్ పెట్ట‌గానే....దానిని ఖండించేందుకు నన్ను ర‌మ్మ‌ని అడుగుతున్నారు. ఆనాడు మీరంతా ఎక్క‌డికి వెళ్లారు? స‌మాజంలోని ప‌క్ష‌పాత ధోర‌ణి న‌న్నెంతో బాధిస్తోంది. ఇంకో విష‌యం....క‌ల్యాణ్ గారికి వ్య‌తిరేకంగా నేను ఎప్పుడూ ఏదీ మాట్లాడ‌లేదు. భ‌విష్య‌త్తులో మాట్లాడ‌ను కూడా. ఏదైనా రాజ‌కీయ పార్టీ న‌న్ను ప్ర‌భావితం చేసి....నా ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రికి వ్య‌తిరేకంగా నాచేత‌ మాట్లాడించడం అసంభ‌వం.``అని రేణు త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.