Begin typing your search above and press return to search.
పెళ్లి ఘడియలు దగ్గర్లోనే ఉన్నాయట
By: Tupaki Desk | 13 Jun 2019 1:14 PM ISTఆ మధ్య రెండో పెళ్లి చేసుకుంటానని ప్రకటించినప్పుడు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ మీద కొందరు ఫ్యాన్స్ ఆన్ లైన్ లో చేసిన రచ్చ గుర్తుందిగా. ఆ తర్వాత ఆవిడ దాని గురించి ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇచ్చాక కానీ ఈ గొడవ సద్దుమణగలేదు. అప్పుడప్పుడు ఇది ఆరని చిచ్చులా బయట పడుతూ ఉండటంతో తన కాబోయే భర్తను నేరుగా చూపించకుండా ఎంగేజ్ మెంట్ ఫోటోలు షేర్ చేసుకున్న రేణు వాటికి పూర్తిగా చెక్ పెట్టేసింది.
ఇది జరిగి ఏడాది అవుతోంది. మధ్యలో ఎన్నో ముహుర్తాలు వచ్చాయి వెళ్లాయి. కానీ వివాహం మాత్రం జరగలేదు. అసలు ఉంటుందా లేక నిశ్చితార్థం దగ్గరే ఆగిపోతుందా అని అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు లేకపోలేదు. రేణు కూడా తర్వాత ఎక్కడా దీని ప్రస్తావన తీసుకురాలేదు. కొడుకు అకీరా అప్పుడప్పుడు పవన్ దగ్గరికి వచ్చి పోతు ఉండటం వీటికి బలం చేకూర్చింది
ఇంకోసారి వీటికి బ్రేక్ వేసే ఉద్దేశంతో రేణు దేశాయ్ తాను తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇందులో స్పెషల్ ఏముంది అనకండి. తీసింది ఆవిడ కాబోయే భర్తే. ఆ విషయాన్నీ స్వయంగా ధృవీకరిస్తూ ఫియాన్సీ గారికి థాంక్స్ అంటూ అందులో పోస్ట్ చేసింది. తనను ఫోటోలు తీస్తూ అమావాస్యకు పున్నమికి తేడా మర్చిపోయిన కాబోయే భర్త గురించి వెరైటీ కామెంట్స్ పెట్టిన రేణు దేశాయ్ మొత్తానికి తమ బంధం కొనసాగుతుందన్న క్లారిటీ అయితే ఇచ్చింది.
వ్యక్తిగత కారణాలు అంటూ అతని ఫోటోలు బయట పెట్టని రేణు కనీసం పెళ్లి రోజైనా భర్తను ప్రపంచానికి చూపించాలని కోరుతున్నారు ఫ్యాన్స్. కొత్త సినిమా స్క్రిప్ట్ పనిలో ఉన్న రేణు దేశాయ్ అకీరాను ఇంకో మూడేళ్ళలో హీరోగా లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది