Begin typing your search above and press return to search.
లైవ్ లోకి వస్తే చికాకు పెట్టారు
By: Tupaki Desk | 2 May 2019 11:45 AM ISTవిడాకులు తీసుకుని చాలా కాలమే అయినా ఇంకా పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే కొందరు అభిమానులు గుర్తిస్తున్న రేణు దేశాయ్ గతం తాలుకు నీడలు వాళ్ళ వల్లే ఇంకా పూర్తిగా తొలగిపోవడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించేందుకు ఇష్టపడే రేణు దేశాయ్ చాలా గ్యాప్ తర్వాత వీడియో లైవ్ లోకి వచ్చారు. సహజంగానే ఇక్కడా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా ఎదురయ్యాయి.
అందులోనూ తన కొత్త లైఫ్ పార్టనర్ గురించి పదే పదే అడగడంతో ఓ దశలో సంయమనం కోల్పోయిన రేణు దేశాయ్ సెలెబ్రిటీలు మనుషులే అని వాళ్ళకూ విడిగా జీవితం ఉంటుందని అది గుర్తించాలని కోరుతూ ఇలా అసంబద్దమైన ఇష్టం లేని ప్రశ్నలతో అదేపనిగా విసిగించడంలో ఆంతర్యం ఏమిటని ఘాటుగానే క్లాసు పీకింది
కాని ఇక్కడో విషయం మర్చిపోకూడదు. ఓపెన్ ప్లాట్ ఫార్మ్ అయిన సోషల్ మీడియాలో ఒకళ్ళు చెబితే వినే స్టేజి లో పబ్లిక్ లేరు. అందులోనూ తాము విపరీతమైన ఆసక్తి చూపించే సినిమా రంగానికి చెందిన వారు ఇలా లైవ్ లోకి వచ్చినప్పుడు విచక్షణ కోల్పోతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదంతా రేణు దేశాయ్ కు తెలియంది కాదు. అయినా మార్పు వచ్చి ఉంటుందేమో గతాన్ని తవ్వరేమో అని భావించిన తనకు ఈసారి కూడా షాక్ తప్పలేదు. ఇంత జరిగనా తన జీవిత భాగస్వామిని మాత్రం రేణు దేశాయ్ ఇప్పటిదాకా పరిచయం చేయనే లేదు