Begin typing your search above and press return to search.

F**k.. రైతుల గురించి మీరా మాట్లాడేది?

By:  Tupaki Desk   |   12 March 2019 7:24 PM IST
F**k.. రైతుల గురించి మీరా మాట్లాడేది?
X
సెలబ్రెటీలను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయడం చాలా కామన్‌ అయ్యింది. సెలబ్రెటీలు ఏం పని చేసినా కూడా వారంటే గిట్టన్ని వారు, వారికి యాంటీగా ఉండే వారు అసభ్యపదజాలంతో బూతులు వాడుతూ ట్రోల్‌ చేయడం మనం చూస్తూనే ఉటాం. అయితే లేడీస్‌ విషయంలో కూడా ఇది మినహాయింపు ఏమీ కాదు. తాజాగా రేణు దేశాయ్‌ పై ఒక వ్యక్తి సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా కామెంట్‌ చేశాడు. రేణు దేశాయ్‌ చేయబోతున్న రైతుల కార్యక్రమంపై అతడు విరుచుకు పడ్డాడు.

అతడి పేరు అయితే రేణుదేశాయ్‌ వెళ్లడించలేదు, కాని అతడు ఏమని కామెంట్‌ చేశాడనే విషయాన్ని పోస్ట్‌ చేసింది. అతడు కామెంట్‌ లో.. నేను ఒక రైతు కొడుకును, నేను కూడా 20 ఏళ్లుగా రైతుగా వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు మీరు వచ్చి రైతులకు ఏం చేస్తారు అంటూ అసభ్య పదజాలం వాడాడు. మీరు మేకప్‌ వేసుకుని, కెమెరా ముందు డ్రామాలు చేస్తూ రైతుల కోసం అంటూ నాటకాలు ఆడటం ఎందుకు అంటూ కామెంట్‌ చేశాడు.

అతడి కామెంట్‌ కు సమాధానంగా రేణు దేశాయ్‌ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది. అందులో రేణు.. ఈ పోస్ట్‌ ఖచ్చితంగా చదువుతారని అనుకుంటున్నాను అంటూ మొదలు పెట్టింది. ఒక సెలబ్రెటీ 'ఎఫ్‌' అనే పదం వాడితే అది ఎంత పెద్ద బ్రేకింగ్‌ న్యూస్‌ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని సెలబ్రెటీలను ఎవరైనా ఇష్టం వచ్చిన పదజాలంతో తిట్టేయవచ్చు, వారు ఎంత తిట్టినా కూడా మౌనంగా ఊరుకోవాలి. వారు చేసే కామెంట్స్‌ ను పట్టించుకోకుండా సెలబ్రెటీలు ఉండాలి. ఒక సెలబ్రెటీ అభిమానిని లేదా ఎవరినైన ఆ పదంతో దూషిస్తే ఊరుకుంటారా, సెలబ్రెటీ అయినంత మాత్రాన ఇంత దారుణంగా ట్రోల్‌ చేయాలా, సెలబ్రెటీలకు భావాలు, భావోద్వేగాలు ఉండవని మీరు భావిస్తున్నారా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

రైతుల గురించి నేను డబ్బు కోసమో లేదంటే మరి దేని గురించో మాట్లాడానే అనుకోండి అది అనవసరం. ఎందుకంటే ఇక్కడ రైతుల సమస్యలు జనాలకు తెలుస్తున్నాయి. ఆ విషయాన్ని మీరు పట్టించుకోకుండా ట్రోల్‌ చేయడం ఏంటంది. ఊరు, పేరు లేకుండా ట్రోల్‌ చేసే వారు సెలబ్రెటీలను విమర్శించడానికి ఎక్కువ సమయం తీసుకుని, విలువైన కాలంను వృదా చేస్తున్నారు. వారు ఆ సమయంను మంచి కోసం ఉపయోగిస్తే మరీ మంచిది.