Begin typing your search above and press return to search.

క్యాన్సర్‌ పేషంట్స్‌ కోసం రేణు దేశాయ్‌..!

By:  Tupaki Desk   |   13 Sept 2020 9:45 AM IST
క్యాన్సర్‌ పేషంట్స్‌ కోసం రేణు దేశాయ్‌..!
X
సోషల్‌ మీడియాలో రేణు దేశాయ్‌ కి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు ప్రతి రోజు వందల్లో నెగటివ్‌ కామెంట్స్‌ వచ్చినా కూడా వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా తాను ఏదైతే చెప్పాలనుకుంటుందో అది చెప్పేందుకు సోషల్‌ మీడియాను ఎక్కువగా వినియోగించుకుంటుంది. తన పిల్లల గురించి తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ ఉండే రేణు దేశాయ్‌ తాజాగా తాను చేసిన ఒక మంచి పని గురించి షేర్‌ చేసి అందరి ప్రశంసలు దక్కించుకుంది.

క్యాన్సర్‌ పేషంట్స్‌ కు ట్రీట్‌ మెంట్‌ కోసం జట్టు తీసేస్తారు. అందుకే వారికోసం స్వచ్చంద సంస్థలు జుట్టు సేకరించి విగ్గు తయారు చేసి వారికి ఇస్తూ ఉంటారు. క్యన్సర్‌ పేషంట్స్‌ కు జట్టు దానం చేయడం చాలా మంచి విషయం. పలువురు సెలబ్రెటీలు మరియు సాదారణ జనాలు కూడా ఇప్పటికే జట్టు దానం చేసిన వారి జాబితాలో చేరాడు. ఇప్పుడు ఆ జాబితాలో రేణు దేశాయ్‌ కూడా చేరడం జరిగింది. ఆమె తన జట్టును దానం చేసినట్లుగా చెబుతూ ఈ ఫొటోలను షేర్‌ చేసింది. జట్టు కట్‌ చేసుకుని స్టైలిష్‌ తో ఉన్న ఫొటోను ఆమె షేర్‌ చేసింది. ఇతరుల కోసం రేణు దేశాయ్‌ జట్టు కట్‌ చేసుకుని మంచితనంతో మరింత అందంగా కనిపిస్తున్నారు అంటూ ఫాలోవర్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.