Begin typing your search above and press return to search.

కాన్సెప్ట్ అర్ధం చేసుకోకుండా కామెంట్లా?

By:  Tupaki Desk   |   27 Oct 2017 10:33 AM IST
కాన్సెప్ట్ అర్ధం చేసుకోకుండా కామెంట్లా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ చాలాకాలంగా కెమెరాకు... తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటోంది. ప్రస్తుతం స్టార్ మాలో వస్తున్న నీతోనే డ్యాన్స్ అనే షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ కొత్త రోల్ లో కెమెరా ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఈ డ్యాన్స్ షో విషయంలో ఓ నెటిజన్ కామెంట్ రేణు దేశాయ్ ను తీవ్రంగా హర్ట్ చేసింది.

ఈ షోలో నిజజీవితంలో జంటలతో తమ పార్టనర్ తో కలిసి డ్యాన్స్ చేస్తారు. అయితే ఈ డ్యాన్స్ షోలో పాల్గొంటున్న జంటలకు అసలే డ్యాన్సే రాదు. వారి డ్యాన్స్ చూడలేక పోతున్నాం.. దానిబదులు వాళ్లు చక్కగా సీరియళ్లు చేసుకుంటూ ఉండటమే బెటరని ఓ నెటిజన్ రేణుదేశాయ్ కు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ రేణుకు కోపం తెప్పించింది. నీతోనే డ్యాన్స్ అనేది కేవలం ఎంటర్ టెయిన్ మెంట్ కోసం చేస్తున్న ప్రోగ్రామే తప్ప కంటెస్టెంట్లలో దాగి ఉన్న డ్యాన్స్ టాలెంట్ ని వెలికితీసే షో ఏమీ కాదని చెప్పుకొచ్చారు. ప్రోగ్రాం కాన్సెప్ట్ ను అర్ధం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేయడం సరికాదన్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య కావడం వల్ల చాలామంది రేణు దేశాయ్ అడగకుండానే సలహాలు ఇచ్చేస్తున్నారు. ఈ సలహాలు ఒకోసారి ఆమెకు కోపం తెప్పించేస్తున్నాయ్. దాంతో ఆమె సీరియస్ అవక తప్పడం లేదు. ఆ మధ్య రెండో పెళ్లి గురించి ఆలోచన చేయాల్సి వచ్చిందనే ఒక్కమాటతో రేణు దేశాయ్ పై కామెంట్లు వెల్లువలా వచ్చేశాయి. దీనికి ఆమె ఒక మహిళ ఆలోచనలు ఎలా ఉండాలనే దానిపై నిర్దేశించాలని చూస్తున్నారంటూ ఘాట్ కౌంటరే ఇచ్చింది.