Begin typing your search above and press return to search.

రోజూ పవన్ ఫోటోలు పోస్ట్ చేస్తా -రేణు

By:  Tupaki Desk   |   15 Sept 2016 9:35 AM IST
రోజూ పవన్ ఫోటోలు పోస్ట్ చేస్తా -రేణు
X
పవన్ మాజీ వైఫ్ రేణూ దేశాయ్ ఈ మధ్య ఓసారి పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ లుక్ తో అన్ సీన్ ఫోటోను ఒకటి ట్వీట్ చేసింది. అప్పటి నుంచి రేణును విపరీతంగా ట్రాలింగ్ చేస్తున్నారు చాలామంది. 'మీరందరూ ఫ్యాన్స్.. నేను ఫ్రెండ్.. నేనెందుకు పవన్ కళ్యాణ్ ఫోటో పోస్ట్ చెయ్యకూడదు.. నేనెందుకు పవన్ గురించి మాట్లాడకూడదు' అంటోంది రేణూ దేశాయ్.

'ఆయనకి ఇష్టం..నాకు ఇష్టం.. ఆయనకి ఇష్టం లేకపోతే నేను మాట్లాడను.. ఎవరికో ఎందుకు ప్రాబ్లెం అయితే నేనెందుకు పట్టించుకోవాలి? విడాకులపై జస్ట్ ఓ సంతకం చేసిన తర్వాత.. మీరు ఇప్పుడు మేం విడిపోయిన క్లైమాక్స్ చూస్తున్నారు. 1999 నుంచి ఈ జర్నీలో 11 ఏళ్లపాటు ఒక భాగం. నేను తన పిల్లలకు తల్లిని. తను నా ఫ్రెండ్. మాకు ఇద్దరు పిల్లలున్నారు.. మేమేం శత్రువులు కాదు. గొడవపడి విడిపోలేదు.. పిల్లల ఎమోషనల్ ఈక్వేషన్ కోసం మేం ఫ్రెండ్లీ రిలేషన్ ని కలిగి ఉన్నాం' అంటూ తన ఆవేశం వెలిబుచ్చింది పవన్ మాజీ వైఫ్.

'పక్క హీరోల ఫ్యాన్సే ఇదంతా చేస్తున్నారు. నాకేదో క్రేజ్ తెచ్చుకోవడం అంటూ ఆరోపణలు చేస్తారు. నిజానికి స్టార్స్ కి మంచి రిలేషన్స్ ఉన్నాయ్. వెంకటేష్ చాలా సార్లు మా ఇంటికొచ్చారు. మహేష్ ని కళ్యాణ్ గారు పైరసీ ఇష్యూలో సపోర్ట్ చేశారు. వాళ్లంతా ప్రొఫెషనల్స్' అని చెప్పిన రేణూ.. 'సెలబ్రిటీలు పర్ఫెక్ట్ గా ఉండాల్సి వస్తుందని.. కామన్ పబ్లిక్ ఎలా అయినా ఉండొచ్చా' అని నిలదీసింది.

'మీకు నచ్చకపోతే ఆ హీరోల అమ్మ.. భార్యను తిట్టడం పద్ధతి కాదు.. సంస్కారం కాదు.. మీ అమ్మానాన్నలు నేర్పింది ఇది కాదు' అంటూ ట్విట్టర్ లో తనకు బూతులు ట్వీట్ చేస్తున్న వాళ్లకు క్లాస్ పీకేసింది. 'మీప్లాబ్లెమ్స్ మీరే చూస్కోండి.. నేను ట్విట్టర్ వదిలిపెట్టను.. రోజూ నేను ఆయన ఫోటోలు ట్వీట్ చేస్తా.. పిల్లల ఫోటోలు మాత్రం అప్పుడప్పుడు పోస్ట్ చేస్తా' అని చెప్పింది రేణు దేశాయ్. చివరగా 'ఆయన నా ఫ్రెండ్. నా పిల్లలకు ఆయన తండ్రి. తన పిల్లలకు నేను తల్లి' అని చెప్పింది పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్.