Begin typing your search above and press return to search.
'ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్'తో ఇండస్ట్రీలోకి రాకండి..
By: Tupaki Desk | 23 Jun 2020 6:00 PM ISTబాలీవుడ్ ఇండస్ట్రీలో సినీతారల వరుస మరణాలు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను.. అన్నీ ఇండస్ట్రీలను కుదిపేస్తున్నాయి. ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువగా ఉందని.. అందుకే బయట నుండి వచ్చే యువతారల భవిష్యత్ నాశనం చేస్తున్నారని ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం పెద్ద దుమారం రేపింది. ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని నెటిజన్లు తీవ్రస్థాయిలో ఇంకా మండిపడుతూనే ఉన్నారు.
అంతేగాక 'బైకాట్ బాలీవుడ్' అనే నినాదాలతో ట్విట్టర్లో పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు. అయితే సుశాంత్ మరణం పై ఇదివరకే చాలామంది సెలబ్రెటీలు నోరుతెరిచి మాట్లాడారు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నటి రేణుదేశాయ్ కూడా స్పందించింది. పవన్ కళ్యాణ్ తో పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన రేణుదేశాయ్ ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతుందని వార్తలొస్తున్న నేపథ్యంలో నెపోటిజం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. "నెపోటిజం కేవలం సినిమా రంగంలోనే కాదు. ప్రతీ రంగంలో ఉంటుందని.. టాలెంట్ ఉండి ధైర్యంగా నిలబడగలిగితే నెపోటిజంను జయించి విజయం సాధించవచ్చని రేణుదేశాయ్ తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ.. "సుశాంత్ చాలా సెన్సిటివ్ అనుకుంటాను. తనకు టాలెంట్ ఉంది కాబట్టి సినిమా రంగంలో సక్సెస్ అయ్యాడని అన్నారు. సుశాంత్ ఎమోషన్స్‌ను తను బ్యాలెన్స్ చేసుకోలేక పోయాడనుకుంటా అందువల్లే డిప్రెషన్ కి గురై ఉంటాడని వ్యాఖ్యానించింది. నిజానికి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్.. నమ్ముకుని సినీ రంగంలోకి రాకూడదని.. మనోధైర్యం కూడా ఉండాలని కాస్త స్ట్రాంగ్ గానే చెప్పింది. మనల్ని మనం ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలంటే చాలా మానసిక ధైర్యం అవసరమని" రేణుదేశాయ్ మాట్లాడింది. ప్రస్తుతం రేణుదేశాయ్ మాటలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
