Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ ఫోటో షేర్ చేసిన మాజీ భార్య..!

By:  Tupaki Desk   |   2 Dec 2020 1:22 PM IST
పవన్ కళ్యాణ్ ఫోటో షేర్ చేసిన మాజీ భార్య..!
X
'బద్రి' సినిమా షూటింగ్ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరిద్దరూ కొన్నాళ్ళు సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి అకిరా నందన్ - ఆద్య అనే ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. 'జానీ' సినిమా తర్వాత నటనకు దూరంగా ఉన్న రేణు దేశాయ్.. పవన్ నటించే సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించింది. అయితే వీరి జీవితం సాపీగా సాగలేదు. కొన్ని రోజుల తర్వాత వ్యక్తిగత కారణాలతో పవన్ - రేణు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్.. అన్నా లెజ్‌నేవా అనే రష్యన్ యువతిని మూడో వివాహం చేసుకున్నారు. రేణు దేశాయ్ కూడా మరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందని అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ.. ఎందుకో ఆమె ఒంటరిగానే ఉంటున్నారు. పవన్ నుంచి విడిపోయాక తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది.

పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా విడిపోయినప్పటికీ పిల్లల కోసం కలుస్తుంటారు. పవన్ కళ్యాణ్ కూడా వీలు కుదిరినప్పుడల్లా రేణు ఇంటికి వెళ్లి అకీరా - ఆద్యలతో సమయం గడిపి వస్తుంటాడు. రీసెంటుగా పవన్ తన పిల్లల కోసం రేణు ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. రేణు దేశాయ్ తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఓ ఫోటో ఈ విషయాన్ని తెలియజేస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ తన ఇద్దరు పిల్లలతో ఆప్యాయంగా గడుపుతున్నాడు. అకీరా - ఆద్య ఇద్దరూ పవన్ ని హత్తుకొని నిద్రపోతున్నారు. ఈ దృశ్యాన్ని తన ఫోన్ లో భందించిన రేణు సోషల్ మీడియా మాధ్యమాల్లో పంచుకుంది. ''కొన్ని అందమైన ఫొటోగ్రాఫ్స్ ని షేర్ చేయాలి.. అవి మీ ఫోన్ యొక్క ఫోటో ఆల్బమ్‌ లో ఉండలేవు.. నా ఫోన్ కెమెరాలో నేను బంధించిన కొన్ని అరుదైన క్షణాలు'' అంటూ రేణు దీనికి క్యాప్షన్ పెట్టింది. అలానే ఈ ఫోటోని షేర్ చేసేటప్పుడు రీ పోస్ట్ చేసేప్పుడు దయచేసి ఎవరూ క్రాప్ చేసి నా ఫ్రేమ్ ని చిడగొట్టవద్దని కోరింది. రేణు షేర్ చేసిన పవన్ కళ్యాణ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.