Begin typing your search above and press return to search.
పవన్ ఫ్యాన్స్ అక్కడే ఆగిపోయారు!
By: Tupaki Desk | 28 Dec 2018 10:07 AM ISTపవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి తరచుగా వార్తల్లో నిలిచే వ్యక్తి. రేణు ఈమధ్య తన మనసులోని భావాలను.. పద్యాలుగా కవితలుగా మార్చి 'ఎ లవ్ - అన్ కండిషనల్' అనే ఒక పుస్తకం రాసింది. ఈ బుక్ ను ప్రమోట్ చేసే కార్యక్రమంలో ఆమె బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె హైదరాబాదులో పలు టీవీ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తోంది.
ఒక ఇంటర్వ్యూలో తన పుస్తకం గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. పవన్ అభిమానులు చాలామంది ఈ పుస్తకం పవన్ గురించేనా అని అడుగుతున్నారని.. కానీ ఈ పుస్తకం పవన్ గురించి కాదని చెప్పింది. ప్రతి విషయాన్నీ పవన్ కళ్యాణ్ తో లింక్ చేయవద్దని కోరింది. "నాకంటూ ఒక జీవితం ఉంది..అవి నా ఆలోచనలు కానీ ఏ వ్యక్తి గురించి కాదు" అని చెప్పింది. అంతే కాకుండా "నేను గతాన్ని వదిలేసి ముందుకు వచ్చేశాను.. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు." అంటూ పవన్ అభిమానులకు చురక అంటించింది.
ఇదిలా ఉంటే రేణు దేశాయి త్వరలోనే మరో పెళ్ళి చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. ఈమధ్యే ఎంగేజ్ మెంట్ కూడా అయింది. ఎవరిని పెళ్ళి చేసుకోనుందనే వివరాలు మాత్రం గోప్యం గా ఉంచింది. పవన్ - రేణు దేశాయ్ ల పిల్లలు అకీరా.. ఆద్య రేణుతోనే ఉన్న విషయం తెలిసిందే.